Apple iPhone 13 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?

Apple iPhone 13 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 15 మరో 2 నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఐఫోన్ 13 కొనుగోలు చేయడం విలువైనదేనా? ఇప్పుడు తెలుసుకుందాం.

Apple iPhone 13 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?

iPhone 13 gets big discount on Flipkart _ Should you buy it or wait for iPhone 15

Updated On : June 23, 2023 / 5:18 PM IST

Apple iPhone 13 Discount : ప్రముఖ ఆపిల్ ఐఫోన్ (iPhone 13) మళ్లీ ధర తగ్గింది. రూ. 57,999లకు 5G ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ అధికారిక ఇండియా స్టోర్‌లో రూ. 69,900 ధర ట్యాగ్‌తో ఫ్లాగ్‌షిప్ ఫోన్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా యూజర్లు ఐఫోన్ 13పై రూ.11,901 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందో ప్రస్తుతానికి తెలియదు. అయితే, ఐఫోన్ 15 త్వరలో వస్తోంది. మరో 2 నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఐఫోన్ 13పై రూ. 57,999 తగ్గింపు పొందవచ్చు. రాబోయే ఐఫోన్ 15 కెమెరా, చిప్‌సెట్, ఫ్రంట్ డిజైన్, బ్యాక్ ఫినిషింగ్ పరంగా భారీ అప్‌గ్రేడ్‌ను పొందవచ్చు. దీనిపై ఎలాంటి నిర్ధారణ కాలేదు. కొత్త ఐఫోన్ చాలా ఖరీదైనదిగా ఉండవచ్చు. ఆపిల్ ధరను దాదాపు రూ. 80వేలు (ఐఫోన్ 14 మాదిరిగా) లేదా కొత్త అప్‌డేట్‌ల కారణంగా కొంచెం ఎక్కువ ధరకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : Apple iPhone 14 Price : అమెజాన్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఇదే సరైన సమయం.. వెంటనే కొనేసుకోండి..!

మీరు కొత్త అప్‌గ్రేడ్‌లను కోరుకుంటే.. అధిక ధర ఐఫోన్ 15 కోసం వేచి ఉండండి. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే ఐఫోన్ 13 కొనుగోలు చేయొచ్చు. రెండేళ్ల నాటి 5G ఫోన్ ఐఫోన్ 14 మాదిరిగానే ఉంది. భారత మార్కెట్లో ధర రూ. 65వేల కన్నా ఎక్కువగా విక్రయిస్తోంది. మీరు 2022 ఐఫోన్‌ను చాలా తక్కువ ధరకు పొందవచ్చు.

iPhone 13 gets big discount on Flipkart _ Should you buy it or wait for iPhone 15

Apple iPhone 13 Discount : iPhone 13 gets big discount on Flipkart _ Should you buy it or wait for iPhone 15

ఈ ఫోన్ ఐఫోన్ 14 మాదిరిగానే ఉంటుంది. అదే కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ, చిప్‌సెట్‌ను హుడ్ కింద పొందవచ్చు. డిజైన్ కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే.. ఆపిల్ ఐఫోన్ 11 లాంచ్ చేసినప్పటి నుంచి అదే డిజైన్‌ను అందిస్తోంది. ఐఫోన్ 13 చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. మీరు ప్రతిసారీ ఈ డీల్ పొందలేరు. ఏడాదికి రెండు లేదా మూడు సార్లు జరగవచ్చు.

ఐఫోన్ 13 యూజర్లకు సున్నితమైన పర్ఫార్మెన్స్ అందించవచ్చు. అద్భుతమైన బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. అయినప్పటికీ, ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు లేదు. బాక్స్‌లో ఛార్జర్ ఉండదనే చెప్పాలి. వినియోగదారులు కొత్త ఛార్జర్‌ని కొనుగోలు చేయాలి లేదా పాతదాన్ని ఎంచుకోవచ్చు.

Read Also : Amazon 5G Revolution Sale : అమెజాన్ 5G సేల్ : 5G స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్స్, మరెన్నో ఆఫర్లు, డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!