Facebook Logo changed : ఫేస్‌బుక్ లోగో మారింది.. ఆ మార్పును గమనించాలంటే భూతద్దం కావాల్సిందేనా!.. సోషల్ మీడియాలో ట్రోల్స్
ఫేస్‌బుక్ లోగోలోని ఎఫ్ అక్షరం పరిమాణాన్ని కాస్త పెంచింది. అదేవిధంగా లోగో బ్యాక్‌గ్రౌండ్‌లో నీలిరంగును కొంచెం ముదురుగా మార్చింది. ఫాంట్ విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. ఫే

Facebook Logo changed
Facebook New Logo: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ లోగో మారింది. మెటా యాజమాన్యం ఫేస్‌బుక్ లోగోలో స్వల్ప మార్పులు చేసింది. అయితే, సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం లోగో మార్పుపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఇంతకీ లోగోలో చేసిన మార్పేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు తీక్షణంగా కొత్త లోగో, పాత లోగోను పరిశీలించి అమ్మో.. కొత్త లోగోలో మార్పులు గుర్తించాలంటే భూతద్ధం కావాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల ఎలాన్ మస్క్ ఆధీనంలోని ట్విటర్ ‘X’గా రీబ్రాండింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. గతంలో ట్విటర్ లోగోలో ప్రసిద్ధ పిట్ట (లారీ ది బర్డ్) లోగో ఉండేది. కానీ, మస్క్ దానిని తొలగించి ‘X’ అక్షరం లోగోను తీసుకొచ్చారు. అయితే, ఇందులో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఫేస్‌బుక్ లోగో మార్పు జరిగినప్పటికీ, అందులో కొత్తగా మార్పు చేసిన విషయం ఏమిటని యూజర్లు తెగ వెతుకుతున్నారు. చివరిగా స్వల్ప మార్పును గమనించి కొత్తలోగోలో మార్పును గమనించాలంటే భూతద్దం కావాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తమ ఐడెంటిటీ సిస్టమ్ అప్‌డేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఫేస్‌బుక్ లోగోను మెటా సర్దుబాటు చేసింది. లోగోలోని ఎఫ్ అక్షరం పరిమాణాన్ని కాస్త పెంచింది. అదేవిధంగా లోగో బ్యాక్‌గ్రౌండ్‌లో నీలిరంగును కొంచెం ముదురుగా మార్చింది. ఫాంట్ విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. ఫేస్‌బుక్ బ్రాండ్‌కు డిఫైనింగ్ మార్క్‌ను సృష్టించడం తమ లక్ష్యమని, కొత్త లోగో సుపరిచితంగా, డైనమిక్‌గానే సొగసైనదిగా భావించేలా ఉండాలనుకున్నట్లు ఫేస్‌బుక్ డిజైన్ డేవ్ ఎన్ ఒక బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ఫేస్ బుక్ కొత్త లోగోపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.
Isn't this Facebook's old logo?
— Konrad | 💙💛 (@kondziuu991) September 21, 2023