ఓటింగ్ ప్రాసెస్ ఇలా : ఎన్నికల వేళ.. గూగుల్ డూడుల్ చూశారా?
దేశవ్యాప్తంగా 17వ సార్వత్రిక ఎన్నికల వేళ.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా డూడుల్ మార్చేసింది.

దేశవ్యాప్తంగా 17వ సార్వత్రిక ఎన్నికల వేళ.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా డూడుల్ మార్చేసింది.
దేశవ్యాప్తంగా 17వ సార్వత్రిక ఎన్నికల వేళ.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా డూడుల్ మార్చేసింది. 2019 లోక్ సభ ఎన్నికలు (ఏప్రిల్ 11, 2019) ప్రారంభమైన సందర్భంగా గూగుల్ ప్రత్యేకించి తొలిసారి ఓటు వేసే దేశ పౌరులను ప్రొత్సహిస్తూ సెర్చ్ పేజీపై ఇంకుతో కూడిన ఫింగర్ డూడుల్ ను డిసిప్లే చేసింది. ఇంక్ ఫింగర్ ను క్లిక్ చేయగానే.. వెంటనే.. యూజర్లకు ఓటింగ్ ప్రక్రియ గురించి పూర్తి సమాచారం ఇచ్చింది.
ఓటు వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో వివరించింది. ఓటరు జాబితాలో మీకు ఓటు ఉన్నప్పుడే ఓటు వేయగలరు. పోలింగ్ బూత్ లు, పోటీ చేసే అభ్యర్థులు, ఎన్నికల తేదీలు, సమయం, గుర్తింపు కార్డులు, ఈవీఎంలు ఇలా ప్రతి సమాచారానికి సంబంధించి వివరాలు అందించింది. పోలింగ్ బూత్ వద్ద ఓటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేదానిపై వివరణ ఇచ్చింది.
2019 సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 18, ఏప్రిల్ 23, ఏప్రిల్ 23, మే6, మే 12, మే 19 వరకు జరుగనున్నాయి. ఏడు దశల్లో మొత్తం 543 లోక్ భ నియోజవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మే 23న ఎన్నికల కమిషన్ ఓట్లను లెక్కింపు ప్రక్రియ చేపట్టి అదే రోజున ఎన్నికల ఫలితాలను విడుదల చేయనుంది.