UPI Payments : యూపీఐ వాడుతున్నారా? ఇంటర్నెట్ లేకుండా పేమెంట్లు ఎలా చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

UPI Payments : యూపీఐ యూజర్లు ఎన్‌పీసీఐ ఇంటర్నెట్ సదుపాయం లేకుండా యూపీఐ పేమెంట్లను అనుమతించే కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది.

UPI Payments : యూపీఐ వాడుతున్నారా? ఇంటర్నెట్ లేకుండా పేమెంట్లు ఎలా చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

How To Make UPI Payment Without Internet

Updated On : January 10, 2025 / 7:54 PM IST

UPI Payments : అసలే ఇది డిజిటల్ యుగం. యూపీఐ వినియోగం రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారింది. రెస్టారెంట్‌లో షాపింగ్ చేయలన్నా లేదా భోజనానికి చెల్లించినా మనలో చాలా మంది ఆన్‌లైన్ పేమెంట్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు.

నగదు రహిత లావాదేవీలను ఉపయోగిస్తుంటారు.అయితే, ఈ యూపీఐ లావాదేవీలు ఇంటర్నెట్ కనెక్టివిటీపై ఆధారపడి ఉంటాయి. ఇంటర్నెట్ ఏ సమయంలోనైనా పని చేయడం ఆపివేస్తే.. అది పేమెంట్లకు అంతరాయం కలిగించవచ్చు. కానీ, ఇప్పుడు, మీరు యూపీఐని ఉపయోగించవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా పేమెంట్లు చేయవచ్చు.

Read Also : OnePlus 13 First Sale : వన్‌ప్లస్ 13 ఫస్ట్ సేల్ మొదలైంది.. భారత్‌లో ఈ ఫోన్ ధర ఎంతంటే?

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇంటర్నెట్ సదుపాయం లేకుండా యూపీఐ పేమెంట్లను అనుమతించే కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది. ఈ సర్వీసు అధికారిక యూఎస్ఎస్‌డీ కోడ్, *99# డయల్ చేయడం ద్వారా బ్యాంకింగ్ సేవలను ఆఫ్‌లైన్‌లో యాక్సెస్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

How To Make UPI Payment Without Internet

UPI Payments without Internet

ఈ నంబర్ ద్వారా వినియోగదారులు ఇంటర్‌బ్యాంక్ ఫండ్ బదిలీలు, అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడం, యూపీఐ పిన్‌లను సెట్ చేయడం లేదా మార్చడం వంటి వివిధ బ్యాంకింగ్ సౌకర్యాలను యాక్సెస్ చేయవచ్చు.

UPI Payments : యూపీఐ పేమెంట్ల కోసం (USSD) కోడ్‌ని ఎలా ఉపయోగించాలి? :

  • మీ బ్యాంక్‌లో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ నుంచి *99# డయల్ చేయండి.
  • మీ ఫోన్ స్క్రీన్‌పై, సంబంధిత నంబర్‌ని ఎంచుకోవడం ద్వారా మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.
  • డబ్బు బదిలీ చేయడం, బ్యాలెన్స్‌లను చెక్ చేయడం లేదా లావాదేవీలను చూడటం వంటి కావాల్సిన బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఎంచుకోండి.
  • డబ్బును బదిలీ చేసేందుకు ‘1’ అని టైప్ చేసి Send ట్యాప్ చేయండి.
  • డబ్బు పంపేందుకు మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, సేవ్ చేసిన కాంటాక్ట్ లేదా మరో ఆప్షన్ మెథడ్ ఎంచుకుని (Send) ట్యాప్ చేయండి.
  • మొబైల్ నంబర్ ఆప్షన్ ఉపయోగిస్తుంటే.. రీసివర్ నంబర్‌ను ఎంటర్ చేసి Send ట్యాప్ చేయండి.
  • పేమెంట్ మొత్తాన్ని ఎంటర్ చేసి Send ఆప్షన్ ట్యాప్ చేయండి.
  • చెల్లింపు కోసం రిమార్క్‌ను యాడ్ చేయండి.
  • లావాదేవీని పూర్తి చేసేందుకు మీ యూపీఐ పిన్‌ని ఎంటర్ చేయండి.

Read Also : Oppo Reno 13 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఒప్పో రెనో 13జీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఈ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లు ఇవే..!