అంతరిక్షం నుంచి నాసా వ్యోమగామి సెల్ఫీ వీడియో.. వైరల్!

  • Published By: sreehari ,Published On : November 27, 2020 / 06:30 PM IST
అంతరిక్షం నుంచి నాసా వ్యోమగామి సెల్ఫీ వీడియో.. వైరల్!

Updated On : November 27, 2020 / 6:47 PM IST

NASA Astronaut Video Of Earth From Space : అంతరిక్షం నుంచి నాసా వ్యోమగామి ఒళ్లు గగుర్పొడిచే వీడియోను షేర్ చేశారు. నాసా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపై ఉపరితలాన్ని వీడియో తీసి తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.



ఇప్పుడా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లూ ప్లానెట్ వ్యూను అంతరిక్షం నుంచి తీసిన తొలి వీడియో ఇదేనంటూ ట్వీట్ చేశాడు. ఇటీవలే అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన నాసా వ్యోమగామి Victor Glover (43) ఈ వీడియోను పోస్టు చేస్తూ.. చూడటానికి అద్భుతంగా ఉన్నప్పటికీ వాస్తవానికి ఇది ఏమాత్రం సరిపోలదన్నాడు.

వీడియోలో కెమెరాతో భూమి ఉపరితలాన్ని ఎలా ఉందో చూపించాడు. అంతరిక్షం నుంచి ఇదే నా ఫస్ట్ వీడియో.. డ్రాగన్ రిసైలెన్స్ కిటికిలో నుంచి భూమిని చూస్తున్నప్పుడు చాలా థ్రిల్లింగ్ గా అనిపించిందని అన్నాడు. ట్విట్టర్‌లో వీడియోను పోస్టు చేసిన వెంటనే దాదాపు 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 1 లక్ష లైకులు, వేలాది కామెంట్లు వచ్చాయి.


ర్ సహా కేట్ రబిన్స్, రష్యన్ కాస్మోనట్స్ సెర్జీ రియాజికోవ్ నలుగురు ఇటీవలే నాసా నుంచి అంతరిక్షంలోకి ప్రవేశించారు. గతవారం నాసా కెండీ అంతరిక్ష కేంద్రం నుంచి కంప్లీట్ ఆటోమేటెడ్ ఫ్లయిట్ అంతరిక్షంలోకి వెళ్లింది. 27 గంటల తర్వాత వ్యోమగామి గ్లోవర్.. అంతరిక్షం నుంచి భూమి వ్యూ ఎలా ఉంటుందో వీడియోలో చూపించాడు.