Ola : ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రివర్స్ గేర్..ఎన్నో విశేషాలు
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ గేర్ లో కూడా నడిపించొచ్చు. దీనికి సంబంధించిన వీడియోను సదరు కంపెనీ విడుదల చేసింది. ఈ వీడియోలో స్కూటర్ రివర్స్ లో వెళుతున్నట్లు కనిపిస్తుంది. కంపెనీ సీఈవో భావేష్ అగర్వాల్ వినూత్నంగా స్పందించారు.

Ola
Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ గేర్ లో కూడా నడిపించొచ్చు. దీనికి సంబంధించిన వీడియోను సదరు కంపెనీ విడుదల చేసింది. ఈ వీడియోలో స్కూటర్ రివర్స్ లో వెళుతున్నట్లు కనిపిస్తుంది. కంపెనీ సీఈవో భావేష్ అగర్వాల్ వినూత్నంగా స్పందించారు. ఆయన కూడా రివర్స్ లో రాసి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారింది. మరో వారం రోజుల్లో మార్కెట్ లోకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల కానుంది. దీనికి ఫుల్ రెస్పాండ్ వస్తోంది.
Read More : ఏపీలో దడ పుట్టిస్తున్న పాములు..!
పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఓలా సిద్ధం చేస్తోంది. ఆగస్టు 15న మార్కెట్ లోకి విడుదల చేసేందుకు చర్యలు తీసుకొంటోంది. పది రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ను త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేస్తాయమని ఓలా ప్రకటించగానే భారీ స్పందన వచ్చింది. గత నెల 15న బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కేవలం ఒక్కరోజులోనే లక్ష స్కూటర్ల వరకు ఆర్డర్స్ రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Read More : New Model Bikes : ఆగస్టులో రయ్‌రయ్‌మంటూ వస్తున్న బైక్స్ ఇవే!
కానీ..దీని ధర ఎంత ఉంటుందనే సంగతి తెలియడం లేదు. అయితే..రూ. 85 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్కూటర్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే…రయ్యి మంటూ 150 కిలోమీటర్ల వరకు హాయిగా వెళ్లిపోవచ్చు. స్కూటర్ లో రెండు హెల్మెట్ లు పెట్టుకొనే సౌకర్యం కల్పించారు. కేవలం 18 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జీ చేసుకోవచ్చని, దేశ వ్యాప్తంగా 400 పట్టణాల్లో లక్షకు పైగా చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఇక సదరు కంపెనీ విడుదల చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ‘లిజన్ టు మీ నౌ’ అనే ఇంగ్లీషు అక్షరాలను రివర్స్ లో రాశారు కంపెనీ సీఈవో.