గూగుల్ Play Store నుంచి Paytm తొలగింపు

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ Play Store నుంచి డిజిటల్ పేమెంట్స్ యాప్ Paytm Appను తొలగించింది. తమ పాలసీలకు విరుద్ధంగా ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించిన అలాంటి యాప్ లను తమ ప్లే స్టోర్ నుంచి తక్షణమే తొలగిస్తామని గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గూగుల్ ప్లే స్టోర్ నుండి పేటీఎం యాప్‌ను శుక్రవారం తొలగించింది.
గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి Paytm App మాత్రమే తొలగించింది. పేటీఎం అందించే ఇతర సర్వీసుల్లో Paytm for Business, Paytm Mall, Paytm Money యాప్స్ Play Storeలో Download చేసుకునేందుకు ఇంకా అందుబాటులోనే ఉన్నాయి.
పేటీఎంలో మీ డబ్బులు సురక్షితమే :
పేటీఎం స్పందిస్తూ.. Paytm Android App తాత్కాలికంగా గూగుల్ ప్లే స్టోర్ అందుబాటులో ఉండదని పేర్కొంది. కొత్తగా ఎవరైనా డౌన్ లోడ్ చేసుకోవాలన్నా లేదా అప్ డేట్ చేసుకోవడం కుదరదని తెలిపింది. ‘పేటీఎం యాప్ త్వరలో ప్లే స్టోర్‌లోకి తిరిగి వస్తుంది.. పేటీఎంలో మీ డబ్బులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి. యూజర్లు ఆందోళన చెందొద్దు.. ఇప్పటికే డౌన్ లోడ్ చేసి ఫోన్ లో ఇన్ స్టాల్ చేసిన Paytm App ద్వారా అన్ని సేవలు ఎప్పటిలానే కొనసాగుతాయి’ అని పేర్కొంది.
Dear Paytm'ers,
Paytm Android app is temporarily unavailable on Google's Play Store for new downloads or updates. It will be back very soon.
All your money is completely safe, and you can continue to enjoy your Paytm app as normal.
— Paytm (@Paytm) September 18, 2020
గూగుల్ ప్లే స్టోర్ యాప్ జాబితాలో Paytm App అని టైప్ చేస్తే.. ఒక ఎర్రర్ కనిపిస్తోంది. “We’re sorry, the requested URL was not found on this server.” అనే మెసేజ్ వస్తోంది.. అంటే దీని అర్థం.. ఆండ్రాయిడ్ యూజర్లు ఇకపై Paytm App ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోలేరు.. ఇప్పటికే యూజర్లు Paytm యాప్ తమ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుని ఉంటే.. మాత్రం పేటీఎం అందించే అన్ని సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
గూగుల్ తన ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి గ్యామ్లింగ్ యాప్ విధానాలను అనుమతించమని పేర్కొంది. Play gambling విధానాలపై తమ బ్లాగులో పోస్ట్ చేసింది. భారతదేశంలో Play gambling ఆమోదించే లేదా ప్రోత్సహించే యాప్ లకు సంబంధించిన సమస్యలపై గూగుల్ ప్రస్తావించింది.
గూగుల్ ప్లే తమ ప్లే స్టోర్ యూజర్లకు సురక్షితమైన అనుభవాన్ని అందించడానికి రూపొందించింది. అలాగే డెవలపర్‌లకు కూడా మంచి వేదికగా మారింది. అనేక టూల్స్ కూడా అందిస్తోంది. తమ గ్లోబల్ పాలసీలు ఎల్లప్పుడూ ఆ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించామని గూగుల్ ఒక బ్లాగు పోస్టులో వెల్లడించింది. యాప్‌ల ద్వారా లభించే ఆన్‌లైన్ కాసినోలతో పాటు స్పోర్ట్స్ బెట్టింగ్ వంటి Play gambling అనుమతించేది లేదని స్పష్టం చేసింది.