Redmi K80 Series Launch : రెడ్‌మి కె80 సిరీస్ వచ్చేస్తోంది.. ఈ నెల 27నే లాంచ్.. పూర్తి వివరాలివే!

Redmi K80 Series Launch : రెడ్‌మి కె80 సిరీస్ నవంబర్ 27న చైనాలో స్థానిక కాలమానం ప్రకారం.. రాత్రి 7:00 గంటలకు (సాయంత్రం 4:30 గంటలకు) లాంచ్ కానుంది.

Redmi K80 Series Launch : రెడ్‌మి కె80 సిరీస్ వచ్చేస్తోంది.. ఈ నెల 27నే లాంచ్.. పూర్తి వివరాలివే!

Redmi K80 Series Launch Set for November 27

Updated On : November 21, 2024 / 10:59 PM IST

Redmi K80 Series Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. వచ్చేవారం చైనీస్ మార్కెట్లోకి రెడ్‌మి కె80 సిరీస్ రానుంది. షావోమీ సబ్-బ్రాండ్, అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్వదేశంలో కొత్త రెడ్‌మి కె సిరీస్ స్మార్ట్‌ఫోన్ల రాకను ధృవీకరించింది. లైనప్‌లో రెగ్యులర్ రెడ్‌మి కె80, రెడ్‌మి కె80 ప్రో ఉంటాయి. రెడ్‌మి కె80 సిరీస్ డిజైన్‌ను వెల్లడించే అధికారిక ఫొటోలను కంపెనీ పోస్ట్ చేసింది. ఇప్పటికే ఆండ్రాయిడ్ 15-ఆధారిత హైపర్ఓఎస్ 2.0తో రానుంది. అలాగే, 2కె రిజల్యూషన్ డిస్‌ప్లేలను కలిగి ఉండనున్నాయి.

రెడ్‌మి కె80 సిరీస్ డిజైన్ :
రెడ్‌మి కె80 సిరీస్ నవంబర్ 27న చైనాలో స్థానిక కాలమానం ప్రకారం.. రాత్రి 7:00 గంటలకు (సాయంత్రం 4:30 గంటలకు) లాంచ్ కానుంది.కంపెనీ వెయిబో హ్యాండిల్ చైనా వెబ్‌సైట్ ద్వారా ఫోన్‌ల డిజైన్‌ను టీజ్ చేసింది. రెడ్‌మి కె80ప్రో డ్యూయల్-టోన్ డిజైన్‌తో స్నో రాక్ వైట్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉండనుంది. 1.9ఎమ్ఎమ్ మందపాటి ప్రొఫైల్‌తో వస్తుంది.

అధికారిక రెండర్‌ల ప్రకారం.. రెడ్‌మి కె80ప్రో హోల్-పంచ్ డిస్‌ప్లేతో వస్తాయి. షావోమీ సివి సిరీస్ ఫోన్‌ల కెమెరా మాడ్యూల్స్‌ను పోలి ఉండే సర్కిల్ బ్యాక్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో 3 సెన్సార్లు ఉన్నాయి. కెమెరా ఐలాండ్ వెలుపల ఎల్ఈడీ ఫ్లాష్ స్ట్రిప్ కలిగి ఉంది. అదనంగా, గిజ్నోచైనా చైనీస్ రీటైలర్ ప్లాట్‌ఫారమ్‌లో కనిపించిన రెడ్‌మికె80, రెడ్‌మి కె80 ప్రో ఫొటోలను షేర్ చేసింది. ప్రామాణిక మోడల్ బ్లాక్, గ్రే, బ్లూ, గ్రీన్ ఆప్షన్లు ప్రో మోడల్ బ్లాక్, గ్రీన్, గ్రే కలర్ ఆప్షన్లను సూచిస్తాయి.

రెడ్‌మి కె80, రెడ్‌మి కె80ప్రో ఇప్పటికే ఆండ్రాయిడ్ 15-ఆధారిత హైపర్ఓఎస్2.0, 2కె రిజల్యూషన్ డిస్‌ప్లేలతో వస్తుంది. రెడ్‌మి కె80 ప్రో కొత్తగా ప్రకటించిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీని కలిగి ఉంటుందని మునుపటి లీక్‌లు సూచిస్తున్నాయి. ప్రామాణిక రెడ్‌మి కె80 గత జనరేషన్స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీలో రన్ అవుతుంది. రెండు మోడల్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68 రేటింగ్‌తో కూడా రావచ్చు.

రెడ్‌మి కె80ప్రో 120డబ్ల్యూ వైర్డు, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను అందిస్తుందని, వెనిలా మోడల్‌లో 90డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, 30డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రెడ్‌మి కె80 ప్రో రెడ్‌మి కె80 వరుసగా పోకో ఎఫ్7ప్రో, పోకో ఎఫ్7 అల్ట్రాగా ప్రపంచ మార్కెట్లలో లాంచ్ కావచ్చు.

Read Also : CBSE Board Exams 2025 : సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 10వ, 12వ తరగతి పరీక్షల ఫుల్ షెడ్యూల్ ఇదిగో..!