వాట్సాప్‌లో Tipline సర్వీసు : ఎన్నికల వేళ.. Fake News చెక్ పాయింట్

2019 సార్వత్రిక ఎన్నికల వేళ.. సోషల్ మీడియా ఫేక్ న్యూస్ భరతం పట్టేందుకు రంగంలోకి దిగింది.

  • Published By: sreehari ,Published On : April 2, 2019 / 01:47 PM IST
వాట్సాప్‌లో  Tipline సర్వీసు : ఎన్నికల వేళ.. Fake News చెక్ పాయింట్

Updated On : April 2, 2019 / 1:47 PM IST

2019 సార్వత్రిక ఎన్నికల వేళ.. సోషల్ మీడియా ఫేక్ న్యూస్ భరతం పట్టేందుకు రంగంలోకి దిగింది.

2019 సార్వత్రిక ఎన్నికల వేళ.. సోషల్ మీడియా ఫేక్ న్యూస్ భరతం పట్టేందుకు రంగంలోకి దిగింది. ఎన్నికలకు సంబంధించి కల్పిత వార్తలు, తప్పుడు సమాచారం, రూమర్లపై ప్రముఖ మెసేంజర్ యాప్ నెట్ వర్క్ వాట్సాప్ ఇండియాలో కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది. ఈ సర్వీసును మీడియా సిక్లింగ్ స్టార్ట్ అప్ కంపెనీ PROTO మంగళవారం TipLine (టిప్ లైన్) సర్వీసును లాంచ్ చేసింది.
Read Also : డేటా ఆఫర్లు అదుర్స్ : ఏప్రిల్ 4 నుంచి జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్

దేశ వ్యాప్తంగా WhatsApp కు 20 కోట్ల మంది యూజర్లు ఉండగా.. రోజుకు మిలియన్ల మెసేజ్ లు స్ర్పెడ్ అవుతున్నాయి. ఈ మెసేజ్ ల్లో ఫేక్ న్యూస్ ఎక్కువగా స్ర్పెడ్ అవుతోంది. సోషల్ ప్లాట్ ఫాంపై ఫేక్ న్యూస్ ను నియంత్రించేందుకు వాట్సాప్ tipline సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. 

ఈ సర్వీసుతో ఎన్నికల సమయంలో ప్లాట్ ఫాంపై మెసేజ్ లను స్టడీ చేసేందుకు చెక్ పాయింట్ టిప్ లైన్ సర్వీసు ఓ డేటా బేస్ ను క్రియేట్ చేస్తుందని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. రూమర్లు, తప్పుడు సమాచారంపై ఎవరైనా ఈ చెక్ పాయింట్ టిప్ లైన్ సర్వీసుకు ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ నుంచి +91-9643-000-888 మెసేజ్ పంపవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ యాప్ ప్లాట్ ఫాంలపై స్పెడ్ అవుతున్న ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారానికి సంబంధించిన ప్రాజెక్టులపై గతంలో డిగ్ డీపర్ మీడియా, మీడాన్ కంపెనీలు సంయుక్తంగా పనిచేశాయి. ప్రొటో సర్వీసు సాయంతో ఇండియాలో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వెరిఫై చేసేందుకు ఈ రెండు సంస్థలు కృషి చేస్తున్నాయి. 

Tipline సర్వీసు ఎలా పనిచేస్తుందంటే?
*
వాట్సాప్ లో యూజర్లు టిప్ లైన్ సర్వీసుతో మెసేజ్ లు షేర్ చేసినట్టయితే.. ప్రొటో వెరిఫికేషన్ సెంటర్ వెంటనే రెస్పాండ్ అవుతుంది. 
* షేర్ చేసిన మెసేజ్ వెరిఫై అయిందో లేదో యూజర్ కు ఇన్ ఫాం చేస్తుంది. 
* షేర్ చేసిన ఇన్ఫ్ ర్మేషన్ ఫొటోలు, వీడియో లింక్ లు, టెక్స్ట్ రూపంలో ఉన్నాయో చెక్ చేస్తుంది. 
*ఆ మెసేజ్ నిజమా? ఫేక్ ? తప్పుడు సమాచారామా? అని వెరిఫై చేస్తుంది. 
*ఇంగ్లీష్ లో మాత్రమే కాకుండా.. రీజినల్ లాంగ్వేజీలు హిందీ, తెలుగు, బెంగాలీ, మలయాళం భాషల్లో కూడా వెరిఫై చేస్తుంది. 
Read Also : పేటీఎంలోకి స్టాక్ మార్కెట్ : బ్రోకింగ్ సర్వీసుకు సెబీ ఆమోదం