Corona Cases Telangana : తెలంగాణలో కొత్తగా 7,754 కరోనా కేసులు, 51 మంది మృతి
తెలంగాణలో ప్రతీ రోజు 7వేలకు పైగానే కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కాస్త పెరిగాయి.

Corona Cases Telangana
new corona cases in Telangana : తెలంగాణలో ప్రతీ రోజు 7వేలకు పైగానే కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కాస్త పెరిగాయి. తాజాగా రాష్ట్రంలో 7వేల 754 మందికి కోరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 51 మంది కరోనాతో మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి మరో 5 వేల 186 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 78 వేల 888 యాక్టివ్ కేసులున్నాయి.
నిన్న ఒక్కరోజే రాష్ర్ట వ్యాప్తంగా 77 వేల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,507 కేసులు ఉన్నాయి.
ఇక, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 630, రంగారెడ్డి జిల్లాలో 544, నల్లగొండ జిల్లాలో 231, సంగారెడ్డి జిల్లాలో 325, మహబూబ్‌నగర్ జిల్లాలో 279 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.