రుణమాఫీ కండిషన్లపై మండిపడ్డ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

వాటికి వర్తించదని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. బ్యాంకర్లు చేసిన తప్పిదాలకు..

రుణమాఫీ కండిషన్లపై మండిపడ్డ బీజేఎల్పీ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి

తెలంగాణలో ఎటువంటి కండిషన్ లేకుండా రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, మరి ఇప్పుడు ఇన్ని కండిషన్స్ ఎందుకు పెట్టారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రీ షెడ్యూల్ చేసిన రుణాలకు మాత్రమే రుణమాఫీ ఇస్తామని అంటున్నారని తెలిపారు. చాలా బ్యాంకులు లోన్ రికవరీ అయ్యి మళ్ళీ కొత్తగా లోన్ ఇచ్చినట్టు బ్యాంకర్లు రైతు పుస్తకాల్లో రాసుకుంటారని చెప్పారు.

వాటికి వర్తించదని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. బ్యాంకర్లు చేసిన తప్పిదాలకు రైతు బలి అవుతారని, ఎందుకీ కండిషన్లని నిలదీశారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని తెలిపారు. రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టీ చాలా మందిని ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఒకే రేషన్ కార్డు లో ఉన్న అన్నదమ్ములు భూములు పంచుకొని విడివిడిగా లోన్ తీసుకుంటారని అన్నారు. వారి పరిస్థితి ఎంటని ప్రశ్నించారు.

ఒక్క రేషన్ కార్డు లో నలుగురి మీద లోన్ ఉంటే ఒక్కరికే ఇవ్వడం మిగతా వారు నష్టపోతారని తెలిపారు. కుటుంబంలో ఒక్కరికి చిన్న ఉద్యోగం ఉన్న కుటుంబం మొత్తానికి తెల్ల రేషన్ కార్డు తీసేస్తారని చెప్పారు. కండీషన్లు పెట్టడం సరైన పద్ధతి కాదని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి కండిషన్ లేకుండా రుణమాఫీ చేయాలన్నారు.

Rythu Runa Mafi : రైతులకు గుడ్‌న్యూస్‌..రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ..