Telangana Cabinet Expansion : తెలంగాణ మంత్రివర్గ రేసులో మరో రెడ్డి నేత పేరు..!
మంత్రివర్గ రేసులో ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ నేతలు (రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి) ఉన్నారు.

Telangana Cabinet Expansion : తెలంగాణ మంత్రివర్గ రేసులో మరో రెడ్డి నేత పేరు తెరపైకి వచ్చింది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను ఆయన కలవనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ను దొంతి మాధవరెడ్డి కలిశారు. మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దొంతి మాధవరెడ్డి వరంగల్ జిల్లాలో కీలక నేతగా ఉన్నారు.
Also Read : బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు- సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
కాగా, ఇప్పటికే వరంగల్ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖలు మంత్రులుగా ఉన్నారు. ఖమ్మం, నల్గొండ నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు వరంగల్ నుంచి ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేంటి అని దొంతి మాధవరెడ్డి అంటున్నారట. పార్టీకి తాను చేసిన సేవలు, మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత కల్పించాలని అధిష్ఠానం పెద్దలను కలిసి విజ్ఞాపనలు అందజేస్తున్నారట దొంతి మాధవరెడ్డి. కాగా, మంత్రివర్గ రేసులో ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ నేతలు (రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి) ఉన్నారు.
Also Read : హరీశ్ రావు కాంగ్రెస్ లో చేరినా ఉపఎన్నిక రాదు, మా దృష్టి అంతా అభివృద్ధి పైనే- సీఎం రేవంత్ రెడ్డి