హైదరాబాద్ లో దుశ్చర్య.. బాలీవుడ్ నటిని షాప్ ఓపెనింగ్ అని పిలిచి..
హైదరాబాద్ నగరంలో బాలీవుడ్ నటిపై దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Attacked On Bollywood Actress
Hyderabad: హైదరాబాద్ నగరంలో బాలీవుడ్ నటిపై దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు నటిని గదిలో బంధించి రూ.50వేలు నగదుతో దుండగులు పరారయ్యారు. బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేయడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో మూసబ్ ట్యాంక్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అయితే, దాడి చేసింది ఎవరు.. వారు ఎక్కడికి వెళ్లారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: Tollywood : సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న దిల్ రాజు మాటలు
ముంబయిలో ఉంటున్న ఓ బాలీవుడ్, టీవీ నటి (30యేళ్లు)కి ఈనెల 17న హైదరాబాద్ కు చెందిన ఓ స్నేహితురాలు ఫోన్ చేసి షాప్ ప్రారంభోత్సవానికి అతిథిగా రావాలని ఆహ్వానించింది. ముంబై నుంచి హైదరాబాద్ కు రానుబోను ప్రయాణ ఖర్చులు భరిస్తారని, పారితోషికం చెల్లిస్తారని చెప్పింది. దీంతో ఈనెల 18వ తేదీన సదరు బాలీవుడ్ నటి హైదరాబాద్ కు చేరుకుంది. మాసబ్ ట్యాంక్ శ్యామ్ నగర్ కాలనీలోని అపార్ట్ మెంట్ లో బస చేశారు. అక్కడ ఓ వృద్ధురాలు నటికి అవసరమైన వసతులు ఏర్పాటు చేసింది. ఈనెల 21న రాత్రి 9గంటల సమయంలో ఇద్దరు మహిళలు నటి ఉన్న గదికి వెళ్లి తమతో కలిసి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు.
Also Read: హీరో సుశాంత్ మృతి కేసు నుంచి రీనా ఎలా బయటపడింది? ప్రేమలో పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది?
అదేరోజు రాత్రి 11గంటల సమయంలో ముగ్గురు పురుషులు నటి ఉన్న గదిలోకి వచ్చి తమతో గడపాలంటూ ఒత్తిడి చేశారు. ఆ తరువాత బలవంతం చేసే ప్రయత్నం చేశారు. దీంతో బాలీవుడ్ నటి గట్టిగా కేకలు వేయడంతోపాటు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అనడంతో ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తరువాత ఇద్దరు మహిళలు నటిని గదిలోనే బందించి ఆమె వద్ద ఉన్న రూ.50వేల నగదుతో వెళ్లిపోయారు. నటి 100 ఫోన్ చేసి విషయాన్ని చెప్పడంతో మాసబ్ ట్యాంకు పోలీసులు నటిని బంధించిన గదికి చేరుకొని ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.