Ayyappa Seva Samithi : ఫోన్ చేస్తే ఇంటికే భోజనం.. కరోనా బాధితులకు ఉచితం

కరోనా కష్టకాలంలోనూ బాధితులకు అండగా నిలుస్తున్నాయి కొన్ని స్వచ్చంద సేవా సంస్థలు. ఆకలితో బాధపడుతున్న వారి కడుపు నింపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి నిర్వాహాకులు కరోనా బాధితులకు ఉచిత భోజనం అందిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సైతం పౌష్టికాహారం అందిస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు సైతం ఉచితంగా భోజనం పెడుతున్నారు.

Ayyappa Seva Samithi : ఫోన్ చేస్తే ఇంటికే భోజనం.. కరోనా బాధితులకు ఉచితం

Bhagyanagar Ayyappa Seva Samithi

Updated On : May 23, 2021 / 6:56 PM IST

Bhagyanagar Ayyappa Seva Samithi : కరోనా కష్టకాలంలోనూ బాధితులకు అండగా నిలుస్తున్నాయి కొన్ని స్వచ్చంద సేవా సంస్థలు. ఆకలితో బాధపడుతున్న వారి కడుపు నింపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి నిర్వాహాకులు కరోనా బాధితులకు ఉచిత భోజనం అందిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సైతం పౌష్టికాహారం అందిస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు సైతం ఉచితంగా భోజనం పెడుతున్నారు.

ఉచిత ఆహారం కోసం కాంటాక్ట్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్.. 7799616163..

కరోనా బాధితులకు ఇచ్చే ఆహారం…
అన్నం, పప్పు, సాంబారు, కూర, మజ్జిగ, పచ్చడి, రోటీ

బ్లాక్ ఫంగస్ బాధితులకు ఇచ్చే పౌష్టికాహారం..
శాండ్ విచ్, ఫ్రూట సలాడ్, వెజిటబుల్ సలాడ్, బిస్కెట్, యాపిల్ జ్యూస్, యాపిల్, బనానా, వాటర్ మిలన్, వాటర్ బాటిల్