Raghunandan On CV Anand : దిశ కేసులో లేని మైనర్ల పట్టింపు ఇప్పుడెందుకు? ఎమ్మెల్యే రఘునందన్

దిశ కేసులో నిందితులు మైనర్లు అయినా వారి ఫోటోలను కూడా విడుదల చేశారు. ఆ కేసులో వర్తించని సెక్షన్ 38 ఇక్కడ ఎలా వర్తిస్తుంది?(Raghunandan On CV Anand)

Raghunandan On CV Anand : దిశ కేసులో లేని మైనర్ల పట్టింపు ఇప్పుడెందుకు? ఎమ్మెల్యే రఘునందన్

Raghunandan On Cv Anand

Updated On : June 8, 2022 / 7:03 PM IST

Raghunandan On CV Anand : జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసుకి సంబంధించి సీపీ సీవీ ఆనంద్ చెప్పిన విషయాల్లో తమకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. బెంజ్ కారు ఎవరిది? ఇన్నోవా ఎవరిది? ఈ విషయాన్ని పోలీసులు ఇప్పటికీ తేల్చలేదన్నారు. మైనర్లు అన్న సాకుతో నిందితుల వివరాలు చెప్పడం లేదన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

దిశ కేసులో నిందితులు మైనర్లు అయినా వారి ఫోటోలను కూడా విడుదల చేశారని ఎమ్మెల్యే రఘునందన్ గుర్తు చేశారు. ఆ కేసులో వర్తించని సెక్షన్ 38 ఇక్కడ ఎలా వర్తిస్తుంది? అని ఆయన నిలదీశారు.(Raghunandan On CV Anand)

”జూన్ 3న జోయల్ డేవిస్ ప్రెస్ మీట్ పెట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయిందని చెప్పారు. రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకు లేడని క్లీన్ చిట్ ఇచ్చారు. నేను ఇచ్చిన ఆధారాలతో మళ్లీ ఈరోజు ఎమ్మెల్యే కొడుకుని A6 నిందితుడిగా కేసులో చేర్చారు. ఇన్వెస్టిగేషన్ సమగ్రంగా చేయని జోయల్ డేవిస్ పై చర్యలు తీసుకుంటారా? లేదా? సీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయ్ అని చెబుతున్నా నాకు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదు? నాకు నోటీసులు ఇచ్చి పిలిస్తే నేను ఆధారాలు తీసుకెళ్లి ఇస్తాను కదా. నిజంగా నేరాలు జరగలేదని ఉంటే.. సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని పిలవాలి. లా అండ్ ఆర్డర్ అంశంలో అఖిలపక్షాన్ని పిలవాలి. ఇతర రాజకీయపార్టీల సలహా తీసుకోవాలి” అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

Revanth Reddy Slams CM : రేప్ కేసు.. కేసీఆర్, ఓవైసీ ఎందుకు స్పందించలేదు? దాడులు చేస్తామని రేవంత్ రెడ్డి వార్నింగ్

కాగా, రేప్ కేసులో బాధితురాలి ఫోటోలు, వీడియోల‌ను విడుదల చేసిన ర‌ఘునంద‌న్ రావుపై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అఘాయిత్యానికి గురైన బాధితుల వివరాలను గోప్యంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రఘునందన్ రావు ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

Jubilee Hills : గ్యాంగ్ రేప్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలి-బండి సంజయ్

తనకు కేసులు కొత్త కాదన్నారు రఘునందన్ రావు. ఉడుత ఊపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు తనను టార్గెట్ చేసే బదులు ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించాలని రఘునందన్ రావు హితవు పలికారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని సూచించారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముగ్గురూ కలిసి తన మీదకు వస్తున్నారని.. మనం తర్వాత కొట్లాడుకుందాం.. ముందుగా అమ్మాయికి న్యాయం జరిగేలా చూడాలని రఘునందన్ రావు చెప్పారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకూ దోషులకు కఠిన శిక్ష పడే వరకు పోరాడుదాం అంటూ రఘునందన్ రావు పిలుపునిచ్చారు.

CV Anand On Punishment : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులకు ఉరిశిక్ష..?