Telangana BJP MLAs : కొత్త స్పీకర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయనున్న బీజేపీ ఎమ్మెల్యేలు

 కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త స్పీకర్ సమక్షంలో ఎనిమిదిమంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.

Telangana BJP MLAs : కొత్త స్పీకర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయనున్న బీజేపీ ఎమ్మెల్యేలు

BJP Leaders Take Oath As MLA'S

Updated On : December 15, 2023 / 2:54 PM IST

Speaker Gaddam Prasad Kumar..BJP MLAs : కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త స్పీకర్ సమక్షంలో ఎనిమిదిమంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. ప్రొటెంస్పీకర్ అక్బరుద్దీన్ ఎంపికను వ్యతిరేకించిన బీజేపీ..అతని సమక్షంలో తమ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయరని తేల్చి చెప్పింది.అసెంబ్లీని కూడా బాయ్ కాట్ చేసింది.ఈక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త స్పీకర్ సమక్షంలో ఈరోజు ఎనిమిదిమంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

కాగా..కాంగ్రెస్ ప్రభత్వం ఏర్పడ్డాక తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం ప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. పోటీగా నామినేషన్ వేయలేదు. డిసెంబర్ 13 సాయంత్రం నామినేషన్ల గడువు ముగియటంతో గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికకు సంబంధించి ఈరోజు ప్రొటెం స్పీకర్ అక్బరుద్ధీన్ ఒవైసీ అధికారికంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీంతో ప్రొటెం స్పీకర్ ఎన్నికను వ్యతిరేకించిన  బీజేపీ ఎమ్మెల్యేలు ఈరోజు కొత్త స్పీకర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.