‘జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు’.. బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

  • Published By: bheemraj ,Published On : November 28, 2020 / 03:48 PM IST
‘జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు’.. బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

Updated On : November 28, 2020 / 4:08 PM IST

Bandi Sanjay sensational comments : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు రావడం తథ్యం అన్నారు. కేసీఆర్ అవినీతి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని చెప్పారు. ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుంది..రాసి పెట్టుకోండి అని పేర్కొన్నారు.



మళ్లీ నిర్వహించే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారం కోసం పేదలకు న్యాయం చేయడం కోసం అధికారంలోకి వస్తామని చెప్పారు. శనివారం (నవంబర్ 28, 2020) రామ్ నగర్ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఆ తర్వాత తెలంగాణలో వచ్చే మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పక్కా అన్నారు.



https://10tv.in/pm-modi-visit-bharat-biotech-review-on-corona-vaccine-manufacturing-and-progress/
టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి పాలన, కుటుంబ పాలన అంతమొందించడానికి, రాష్ట్రంలో పేద ప్రజల రాజ్యం రావడానికి, పేదలకు న్యాయం చేయడానికి బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడనని తేల్చి చెప్పారు. ఇంట్లో చెప్పే వచ్చాను..చావుకైనా భయపడేది లేదన్నారు.