MLA Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా.. ఆసక్తికర ట్వీట్ చేసిన ఎమ్మెల్యే

కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా అందరికీ తెలుసు.. ఒకప్పుడు ఆయన క్రికెటర్ కూడా..అయితే తాజాగా కౌశిక్ రెడ్డి చేసిన ఒక ట్వీట్‌తో ఆయన లవ్ స్టోరీ బయటకు వచ్చింది.. ఆసక్తి రేపుతోంది.

MLA Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా.. ఆసక్తికర ట్వీట్ చేసిన ఎమ్మెల్యే

MLA Kaushik Reddy

Updated On : February 13, 2024 / 3:34 PM IST

MLA Kaushik Reddy : హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, షాలిని రెడ్డి దంపతులు 15వ పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తన భార్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూ కౌశిక్ రెడ్డి పెట్టిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది.

మేడిగడ్డ వెళ్తున్న సీఎం రేవంత్, మంత్రులకు కీలక సూచన చేసిన హరీశ్ రావు.. అదేమిటంటే?

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, షాలిని రెడ్డి దంపతులు ఈరోజు 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భార్యకు విషెస్ చెబుతూ కౌశిక్ రెడ్డి తమ పెళ్లి ఫోటోలతో పాటు చిన్ననాటి ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. ‘స్కూల్ ఫ్రెండ్ నుండి జీవిత భాగస్వామి వరకు.. 15 సంవత్సరాల వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌ని బట్టి కౌశిక్ రెడ్డి తన స్కూల్ మేట్ అయిన షాలిని రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అర్ధం అవుతోంది. కౌశిక్ రెడ్డి ట్వీట్‌పై నెటిజన్లు స్పందించారు. శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘వేలంటైన్స్ డే’కి ఒకరోజు ముందు కౌశిక్ రెడ్డి పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

కౌశిక్ రెడ్డి.. షాలిని రెడ్డి స్కూల్లో డేస్‌లో మంచి స్నేహితులట.. ఒకే బెంచ్‌లో కూర్చునే వారట. కౌశిక్ రెడ్డి  క్రికెట్ కోసం క్యాంపులకి వెళ్లినపుడు షాలిని ఆయనకు స్కూల్ నోట్స్ రాసి ఇచ్చేవారట. 10వ తరగతి కంప్లీట్ కాగానే కౌశిక్ రెడ్డి షాలినికి ప్రపోజ్ చేసారట. మొదట షాకైనా షాలిని తర్వాత ఆయన ప్రేమను అంగీకరించారట.  వీరి పెళ్లి కూడా ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా కూల్‌గా జరిగిపోయిందట. ఈ  విషయాన్ని ఈ జంట రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

బీఆర్ఎస్‌కు మరో బిగ్‌షాక్‌.. సీఎం రేవంత్‌ను కలిసిన గ్రేటర్ డిప్యూటీ మేయర్ దంపతులు

కౌశిక్ రెడ్డి పొలిటీషియన్ మాత్రమే కాదు.. ఒకప్పుడు క్రికెటర్ కూడా. 2004-2007 మధ్య హైదరాబాద్ తరపున 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడారు. రాజకీయాల్లోకి వచ్చాక క్రికెట్‌కి దూరమయ్యారు. 2018 లో హుజురాబాద్ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్ధి ఈటెల రాజేందర్‌పై కాంగ్రెస్ తరపున పోటీ చేసి కౌశిక్ రెడ్డి ఓడిపోయారు. కాగా 2021 జూలై 21న టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా శాసనమండలికి పంపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్‌పై 16,873 ఓట్ల మెజారిటీతో గెలుపొంది మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఆయన గెలుపు వెనుక భార్య షాలిని రెడ్డి పాత్ర చాలానే ఉంది.