BRS MLA Malla Reddy : రెండ్రోజులుగా డైలమాలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో మల్లన్న
BRS MLA Malla Reddy : రెండ్రోజులుగా డైలమాలో పడిపోయారు. మామూలుగా అయితే సంబంధం లేదనో.. కుట్రలనో హంగామా చేసేవారు. ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్స్ అప్పుడు మల్లారెడ్డి చేసిన హడావుడి అంతాఇంతా కాదు.

BRS MLA Malla Reddy
BRS MLA Malla Reddy : మల్లారెడ్డి. డ్యాన్సులే కాదు..పొలిటికల్ డ్రామాల్లోనూ ఫస్టే ఉంటారు. సిచ్యువేషన్ కు తగ్గట్లుగా సీన్ ను ఇట్టే రక్తి కట్టించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. దబాయించో, బతిమిలాడో ఎలాంటి పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకుంటారు మల్లన్న. కానీ రెండ్రోజులుగా డైలమాలో పడిపోయారు. మామూలుగా అయితే సంబంధం లేదనో.. కుట్రలనో హంగామా చేసేవారు. ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్స్ అప్పుడు మల్లారెడ్డి చేసిన హడావుడి అంతాఇంతా కాదు. కానీ తన అల్లుడి అక్రమ ఆస్తులు కూల్చేస్తున్నా..కండ్ల ముందే బిల్డింగులు నేలమట్టమైనా నోరుమెదపలేదు. సాయంత్రానికి రాజకీయ కథా చిత్రం షురూ చేశారు.
పొలిటికల్ పిక్చర్‌లో ట్విస్ట్.. :
అల్లుడి అక్రమ నిర్మాణాలను వరుస పెట్టి కూల్చేస్తుండగానే.. సాయంత్రానికి కాంగ్రెస్ నేత ఇంట్లో ప్రత్యక్షమయ్యారు మల్లన్న. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యి.. కారు దిగి.. హస్తంకు షేక్ హ్యాండ్ ఇస్తారన్న ఊహాగానాలకు తెరలేపారు. సీన్ కట్ చేస్తే తెల్లారే సరికి పొలిటికల్ పిక్చర్‌లో ట్విస్ట్.. కేసీఆర్‌ను కలిసిన మల్లన్న తూచ్.. నేను పార్టీ మారడం లేదనేశారట..
అంతేకాదు తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని స్పష్టం చేసినట్లు సమాచారం. తన కాలేజీలో నిర్మాణాల కూల్చివేత ఆపాలని మాత్రమే వేం నరేందర్ రెడ్డిని కోరినట్లు చెప్పుకొచ్చారని సమాచారం.. అంతేకాదు తన కొడుక్కు మల్కాజిగిరి టిక్కెట్ విషయంలోనూ మల్లారెడ్డి వెనక్కి తగ్గారు.. ఎంపీ అభ్యర్ధిగా అధిష్టానం ఎవరికి అవకాశం ఇచ్చినా సపోర్ట్ చేస్తానని చెప్పారంట మల్లన్న..
హస్తం గూటికి తాత్కాలికంగా బ్రేక్ :
ఇదిలా ఉంటే మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారని ప్రచారం మాత్రం జోరుగానే జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తోటకూర జంగయ్యయాదవ్ మల్లారెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మల్లారెడ్డి హస్తం గూటికి చేరేందుకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
పార్టీ మారనంటున్నారు సరే. కొడుక్కి లోక్‌సభ టికెట్ ఎందుకు వద్దంటున్నారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్‌గా మారింది.. తన కొడుకు భద్రారెడ్డిని మల్కాజిగిరి ఎంపీగా బరిలోకి దించాలనుకున్నారు మల్లారెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పిలిచి కార్యకర్తల సమావేశం కూడా పెట్టారు.
పదిహేను రోజుల్లోనే రివర్స్ గేర్ :
కేటీఆర్ తో స్టేజ్ పై భద్రారెడ్డిని పరిచయం కూడా చేయించారు. దీంతో మల్లారెడ్డి కొడుకే మల్కాజిగిరి బరిలో ఉంటారని భావించారంతా. కానీ పదిహేను రోజుల్లోనే రివర్స్ గేర్ పడింది.. తమ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరం ఎమ్మెల్యేలుగా ఉన్నామని.. తన కొడుక్కి ఎంపీ టికెట్ వద్దని చెప్తున్నారట. మల్లన్న మాటల్లో లాజిక్కే వేరు. కొడుక్కి మొదట ఎంపీ టికెట్ అడిగినప్పుడు కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్న విషయం తెలియదా అంటే. తెలుసు. కానీ పరిస్థితులు, పరేషాన్లను బేరీజు వేసుకునే కొడుక్కు టిక్కెట్ వద్దంటున్నారన్న చర్చ జరుగుతోంది.
Read Also : YCP 11th List : వైసీపీ 11వ జాబితా విడుదల.. కర్నూలు వైసీపీ పార్లమెంట్ ఇంచార్జ్‌గా బి.వై. రామయ్య