Padi Kaushik Reddy: నేను AK 47 అవుతా, ఊహించని సాక్ష్యాలతో వస్తా, మీ అక్రమాలన్నీ బయటపెడతా- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

న్యాయం గెలిచింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇలాంటి తప్పుడు కేసులు పెడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.

Padi Kaushik Reddy: నేను AK 47 అవుతా, ఊహించని సాక్ష్యాలతో వస్తా, మీ అక్రమాలన్నీ బయటపెడతా- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

Padi Kaushik Reddy

Updated On : June 22, 2025 / 1:09 AM IST

Padi Kaushik Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నన్ను జైలుకి పంపేందుకు రాత్రి నుండి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు. తనపై నమోదైనవన్నీ అక్రమ కేసులో అని అన్నారు. బెయిల్ మంజూరు అయ్యాక కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాపై ఎన్ని కేసులు పెడితే అంత ఏకే 47 అవుతానని అన్నారు. జిల్లాలో జరుగుతున్న స్కామ్ లన్నీ బయటపెడతానని వ్యాఖ్యానించారు.

”మా లీగల్ టీమ్ కు పేరు పేరునా కృతజ్ఞతలు. నన్ను జైలుకి పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడను. నేను Ak 47 ను అవుతా రేవంత్ రెడ్డి. మంత్రులు ఇసుక దందా చేస్తున్నారు. పేదల భూములు కబ్జా చేస్తున్నారు. మీ బట్టలు విప్పుతా. మీ అక్రమాలు ఆధారాలతో సహా బయట పెడతా. హైదారాబాద్ లో ఊహించని సాక్ష్యాలతో మీడియా ముందుకు వస్తా. తెలంగాణ భవన్ లో పూర్తి ఆధారాలతో మీడియా సమావేశం పెడతా. కాంట్రాక్టర్ల దగ్గర 20శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. జిల్లాలో జరుగుతున్న స్కామ్ లన్నీ ప్రెస్ మీట్ పెట్టి బయటపెడతా. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా వసూళ్లకు పాల్పడుతున్నారో, దందాలు చేస్తున్నారో ఆధారాలతో సహా బయటపెడతా” అని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.

Also Read: హైదరాబాద్ లో రూ.500 కోట్ల స్కాం.. మొత్తం సాగిందిలా.. బయటపడిందిలా..

BRS నేత బోయిన్ పల్లి వినోద్ కుమార్..
కౌశిక్ రెడ్డి పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. కుట్రపూరిత ఆరోపణలతో కేసులు పెట్టారు. చివరికి న్యాయమే గెలిచింది. రిమాండ్ రిపోర్ట్ లో మరికొన్ని సెక్షన్లు చేర్చి జైలుకి పంపాలని చూశారు. మా లీగల్ టీమ్ వాదించారు. న్యాయమూర్తి రిమాండ్ ను రిజెక్ట్ చేశారు. ఓడిపోయినా మేము ఇంటికాడ కూర్చోలేదు. ప్రజల మధ్యే ఉన్నాం.

ఎర్రబెల్లి దయాకర్ రావు..
తెలంగాణ రాష్ట్రం అంతా ఈ కేసు పట్ల ఉత్కంఠగా చేసింది. ఈ అరెస్ట్ కుట్ర వెనక రేవంత్ రెడ్డి ఉన్నారు. కావాలని తప్పుడు కేసులు పెట్టారు. వరంగల్ సీపీ పైనా ఒత్తిడి తెచ్చారు. మా పార్టీ లీగల్ సెల్ బలమైన వాదనలు వినిపించింది. న్యాయం గెలిచింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇలాంటి తప్పుడు కేసులు పెడితే ప్రజలు తగిన బుద్ధి చెపుతారు.