తెలంగాణలో లాక్‌డౌన్‌ 15న ఎత్తేసే చాన్స్‌ లేదు – కేసీఆర్

  • Published By: madhu ,Published On : March 30, 2020 / 05:47 AM IST
తెలంగాణలో లాక్‌డౌన్‌ 15న ఎత్తేసే చాన్స్‌ లేదు – కేసీఆర్

Updated On : March 30, 2020 / 5:47 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి కొలుకొని డిశ్చార్జ్ కాగా..2020, మార్చి 30వ తేదీ సోమవారం 11 మందికి నెగటివ్ రావడంతో..వీరిని ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో..రాష్ట్రంలో విధించిన లాక్ డౌన్ ఎత్తివేస్తారనేూ ప్రచారం జరిగింది. దీనిపై సీఎం కేసీఆర్.. క్లారిటీ ఇచ్చారు. 2020, మార్చి 29వ తేదీ ఆదివారం మీడియాతో మాట్లాడారు.

* ఢిల్లీ నుంచి వారందరినీ పట్టుకున్నాం. కొత్తగూడెంలో 200 మంది, ఒక చోట 130 మందిని పట్టుకున్నారు. 
* నిబంధనల ప్రకారం తుది పరీక్షల్లో 11 మందికి నెగటివ్ అని తేలిన తర్వాత..డిశ్చార్జ్ చేస్తారు. 
* ఇక చికిత్సలో 58 మంది మాత్రమే మిగులుతారు. 
* 76 ఏళ్ల ఒక రోగికి కిడ్నీ, ఇతర సమస్యలున్నాయి. ఆయన తప్పా..మిగతా వారందరూ ఆరోగ్యంగా ఉన్నారు. 

ఏప్రిల్ 15న రాష్ట్రంలో ఎత్తేసే అవకాశం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతా మంచిగున్న తరుణంలో వైరస్ సోకితే ఎలా ? అని ప్రశ్నించారు. ముందు దేశం స్థిమిత పడాలి..ఆ విషయాన్ని వైద్య నిపుణులు చెప్పిన అనంతరం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి దేశం, రాష్ట్రం కోలుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. బయటపడే వరకు నియంత్రణ పాటించాల్సిందేనంటున్నారు. అంటే..ఏప్రిల్ 15వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.

* విదేశాల నుంచి వచ్చిన మొత్తం 25 వేల 937 మంది. 
* వీరిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నాం. వీరి గడువు మార్చి 30వ తేదీతో ముగుస్తుంది. 
* మార్చి 30వ తేదీన 1, 899 మంది, మార్చి 31న 1,440, ఏప్రిల్ 1న 1, 461, ఏప్రిల్ 02న 1, 887, ఏప్రిల్ 03న 1, 476, ఏప్రిల్ 04న 1, 453 మంది, ఏప్రిల్ 05న 914, ఏప్రిల్ * 06న 454, ఏప్రిల్ 07న 397 మంది క్వారంటైన్ ముగుస్తుంది.
* ఏప్రిల్ 07 తర్వాత రాష్ట్రంలో కరోనాకు సంబంధించి వ్యక్తి ఉండడు.