CM KCR : అందుకే, కొత్త రాజ్యాంగం కావాలి.. కారణాలు చెప్పిన కేసీఆర్

దేశంలోని దళితుల బాగు కోసం, దేశమంతా దళితబంధు అమలు చేయాలని, దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.

CM KCR : అందుకే, కొత్త రాజ్యాంగం కావాలి.. కారణాలు చెప్పిన కేసీఆర్

Cm Kcr

Updated On : February 13, 2022 / 9:37 PM IST

CM KCR : కొత్త రాజ్యాంగం కావాలని తాను అనడానికి కారణం ఏంటో తెలంగాణ సీఎం కేసీఆర్ వివరించారు. దేశంలోని దళితుల బాగు కోసమే కొత్త రాజ్యాంగం కావాలంటున్నానని ఆయన చెప్పారు. దేశమంతా దళితబంధు అమలు చేయాలని, దీనికోసమే కొత్త రాజ్యాంగం రాయాలని కోరుతున్నానని, దీనిని దళిత సంఘాలు వద్దంటాయా? అని ప్రశ్నించారు.

దళిత సంఘాలకు, రాజ్యాంగానికి ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం, బీసీల కులగణన కోసం, ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కోసం కొత్త రాజ్యాంగం రావాలని కోరుతున్నానని కేసీఆర్ వివరించారు. దేశం బాగుపడాలంటే.. అందరికీ సమాన హక్కుల కోసం రాజ్యాంగం మారాలని అభిప్రాయపడ్డారు. 77 శాతం దేశ సంపద 90 శాతం మంది దగ్గర ఉండాలనే కొత్త రాజ్యాంగం కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

Realme C35 Phone : రూ.13 వేలకే రియల్‌మీ కొత్త ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరా..!

భారతదేశం అమెరికా కన్నా గొప్ప ఆర్థికశక్తిగా ఎదిగేందుకు కొత్త చట్టం, కొత్త స్ఫూర్తి రావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది… దీన్ని అడ్డుకునేందుకు కొత్త రాజ్యాంగం రాయాలి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలా భారతదేశం కూడా మారాలన్న ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నానని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో ఆ వీలు లేదన్నారు కేసీఆర్. అంబేద్కర్ అంటే నాకు ఎంతో గౌరవం అని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చుకోవాలని, ప్రగతిశీలంగా ఉండాలని కేసీఆర్ అన్నారు.

ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరిహద్దుల్లో డ్రామాలు చేస్తుంటారని, ఈ తరహా రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు కేసీఆర్. అసోం సీఎం వ్యాఖ్యల నేపథ్యంలోనే తాను రాహుల్ గాంధీ విషయం మాట్లాడాను తప్ప, తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతివ్వడంపైనా కేసీఆర్ మండిపడ్డారు. అమెరికా ఎన్నికలు అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకున్నారా అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు. అమెరికా ఎన్నికలతో మీకేం సంబంధం.. ఎవరైనా వేరే దేశం ఎన్నికల్లో ప్రచారం చేస్తారా.. ఇది విదేశీ నీతేనా..? అని ప్రశ్నించారు. బుద్ది ఉన్న ప్రధాని ఎవరైనా.. ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకుంటారా అని నిలదీశారు.

కళ్లకు మేలు చేసే ఆహారాలు ఇవే..!

దేశంలో చర్చనీయాంశంగా మారిన హిజాబ్ వివాదంపైనా కేసీఆర్ స్పందించారు. ఈ వివాదంపై ప్రధానితో పాటు దేశం మొత్తం మౌనం వహిస్తోందని.. అంతర్యుద్ధం చెలరేగితే దేశం గతేంటని.. కర్ణాటక పరిస్థితి దేశ వ్యాప్తంగా వస్తే పరిస్థితి ఏంటని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ విద్వేషపూరిత మత రాజకీయాల గురించి యువత ఆలోచించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దేశ యువత మధ్య ఎందుకు విద్వేషాలు రగులుస్తున్నారని నిలదీశారు. శాంతిభద్రతలు కోరుకుందామా? ఘర్షణలు, కర్ఫ్యూలు కోరుకుందామా? అనేది యువత ఆలోచించుకోవాలన్నారు. శాంతి లేని చోట పెట్టుబడులు ఎవరు పెడతారని కేసీఆర్ ధ్వజమెత్తారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ తగ్గేదేలే అంటున్నారు. ప్రధాని మోదీతో సమరానికి సై అంటున్నారు. ప్రధాని మోదీని, బీజేపీ నేతలను టార్గెట్ చేసిన కేసీఆర్.. మరోసారి వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. బీజేపీ మస్ట్ గో ఫ్రమ్ దిస్ కంట్రీ (బీజేపీ ఈ దేశం నుంచి వెళ్లిపోవాలంతే) అని కేసీఆర్ నినందించారు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉండడానికి వీల్లేదని అన్నారు. ఇప్పటికే బీజేపీ చేసిన పాపాలు ఎక్కువైపోయాయని, మోదీకి ఇచ్చిన సమయంలో 80 శాతం అయిపోయిందని కేసీఆర్ అన్నారు.

”నన్ను జైలుకు పంపుతామని అంటున్నారు. వీళ్లను చూస్తే నిజంగా జాలి కలుగుతుంది… దమ్మున్న వాళ్లయితే నన్ను జైల్లో వేసి చూడండి. అయినా తప్పు చేసినోళ్లే అలాంటి మాటలకు భయపడతారు. నాకా భయం లేదు. జైల్లో వేస్తా అనగానే తోకగాళ్లు భయపడతారు కానీ, మాకేం భయం!

మమ్మల్ని కాదు… మిమ్మల్ని జైల్లో వేయడం మాత్రం పక్కా! కేంద్రం అవినీతిపై భయంకరమైన చిట్టా ఉంది. మొత్తం బద్దలు కొడతాం. దేశంలో రాఫెల్ కుంభకోణం బయటకు రావాలి. అందులో దొంగలు బయటపడాలి. రాఫెల్ డీల్ స్కామ్ గురించి రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. మేం కూడా సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నాం. మోదీ సర్కారు దీంట్లో వేల కోట్లు మింగింది. ఈ దొంగతనాన్ని మేం బయటపెడతాం. రాఫెల్‌పై రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయనపై ఈడీ, సీబీఐ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్ యుద్ధ విమానాలను 9.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నిన్న ఇండోనేషియా దేశం 42 రాఫెల్ యుద్ధ విమానాలను కేవలం 8 బిలియన్ డాలర్లకే కొన్నది. మనకంటే తక్కువ ధరకే కొనుగోలు చేసింది. పైగా ఇండోనేషియా 6 విమానాలు ఎక్కువగా కొనుగోలు చేసింది. ఇప్పుడు తెలియడం లేదా ఎవడు దొంగ అనేది? ఎవడు జైలుకు పోతాడో వాడే పోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ అంశాన్ని వదలను. ఢిల్లీలో దీనిపై వందశాతం పంచాయితీ పెడతాం” అని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.