CM KCR : సాగు నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు : సీఎం కేసీఆర్
తెలంగాణ సాగు నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు, అధికారులు, న్యాయవాదులతో సీఎం కేసీఆర్ చర్చించారు.

CM KCR Review Irrigation : తెలంగాణ సాగు నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు, అధికారులు, న్యాయవాదులతో సీఎం కేసీఆర్ చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సాగునీటి హక్కుల కోసం పోరాడుతామన్నారు. బోర్డు సమావేశాల్లో తెలంగాణ వాదన బలంగా వినిపించాలని అధికారులను ఆదేశించారు. రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వెనుకడుగు వేయబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కొన్నివారాల కిందట నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను ఆయా బోర్డుల పరిధిలోకి తీసుకురావడంపై తెలంగాణ అసంతృప్తితో ఉంది. ఇటువంటి సమయంలో కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాయడంతో ఏం జరగనుందో అనే ఉత్కంఠ నెలకొంది.