సీఎం కేసీఆర్ కంట కన్నీళ్లు

ఆప్తుడు, సన్నిహితుడు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పార్థీవ దేహనికి నివాళుర్పించారు. నివాళులు అర్పిస్తున్న సమయంలో కన్నీటిపర్యంతమయ్యారు. భౌతికకాయం వద్ద కొద్దిసేపు కూర్చొన్న ఆయన..సోలిపేట కుటుంబసభ్యులను ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు.
అనారోగ్యంతో బాధ పడుతున్న సోలిపేట రామలింగారెడ్డి…2020, ఆగస్టు 06వ తేదీ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల నేతలు, ఇతర రంగాలకు చెందిన వారు సంతాపం తెలియచేశారు. భౌతికకాయాన్ని..నేరుగా ఆయన స్వగ్రమమైన చిట్టాపూర్ కు తరలించారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సోలిపేట భౌతికకాయానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం చిట్టాపూర్ గ్రామానికి వెళ్లిన సీఎం కేసీఆర్…ఘనంగా నివాళలర్పించారు. ఉద్యమంలో కలిసి పనిచేసిన..రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు.
ఎమ్మెల్యే శ్రీ సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఎమ్మెల్యే శ్రీ సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.
— Telangana CMO (@TelanganaCMO) August 6, 2020
ఇటీవలే రామలింగారెడ్డి కాలికి శస్త్ర చికిత్స జరిగింది. కానీ మరలా తిరగబడడంతో అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిపించారు గురువారం.. గుండెపోటు రావడంతో అర్ధరాత్రి కన్నుమూశారు.
సోలిపేట రామలింగారెడ్డికి భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. రామలింగారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు.జర్నలిస్టుగా పనిచేశారు. సోలిపేట తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
ఆయన 2004, 2008లో ఉమ్మడి ఏపీలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి దొమ్మాట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన…శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.