Rythu Bharosa : సంక్రాంతి తర్వాత.. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండగ చేస్తామని హామీ ఇచ్చామని.. చెప్పినట్లే..

Rythu Bharosa : సంక్రాంతి తర్వాత.. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..

Rythu Bharosa (Photo Credit : Google)

Updated On : December 1, 2024 / 8:05 PM IST

Rythu Bharosa : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందిస్తామన్నారు. పండగ తర్వాత రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామన్నారు. రైతు భరోసా కొనసాగిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి.. మారీచుడు లాంటి విపక్ష నేతలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఎవరు అడ్డు పడినా రైతు భరోసా అందించి తీరతామన్నారు. రైతు భరోసా హామీ సోనియా గాంధీ గ్యారెంటీ అని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తేల్చి చెప్పారు.

రైతు భరోసాపై రాష్ట్రంలో ఉన్న రైతులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైతు రుణమాఫీ నిన్నటితో పూర్తైంది. రైతు భరోసా నిధులను ఎప్పుడు వేస్తారు అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వారికి శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేయబోతున్నారు. వానా కాలం రైతు భరోసా నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో వేయనున్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండగ చేస్తామని హామీ ఇచ్చామని.. చెప్పినట్లే రైతులకు వ్యవసాయాన్ని పండగ చేసి చూపించామని రేవంత్ సర్కార్ అంటోంది. దీనికి సాక్ష్యంగా నిన్న మొత్తం నాలుగు విడతల్లో రుణమాఫీ చేశామంది. 20 వేల 616 కోట్ల రూపాయలు.. 25 లక్షల 35వేల 964 మంది రైతుల రుణం మాఫీ అయిపోందని ప్రభుత్వం వెల్లడించింది. అంటే వ్యవసాయాన్ని మేము పూర్తిగా పండగ చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఇక రైతు భరోసాపై ఆశతో ఎదురు చూస్తున్న రైతులందరూ సంక్రాంతి తర్వాత రైతు భరోసాను వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన విధివిధానాలపై క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ సిద్ధంగా ఉంది.

9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, విధి విధానాలు ఏంటి, ఎన్ని ఎకరాలకు రైతు భరోసాను పరిమితం చేయాలి.. ఈ వివరాలన్నీ అసెంబ్లీ వేదికగానే చర్చిస్తామని, దానికి అనుగుణంగానే సంక్రాంతి పండగ తర్వాత రైతు భరోసా వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 20వేల 612 కోట్లను ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే రైతు రుణమాఫీ చేసి చూపించామంది. సన్నాలకు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చామంది.

 

Also Read : తెలంగాణ సీఎస్‌కు, పలువురు IASలకు మధ్య గ్యాప్..!