గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు..!- సీఎం రేవంత్ రెడ్డి

కేటీఆర్ కుటుంబం దోచుకున్న విషయాలు చర్చించకుండా ఉండడానికి నా మీద ఆరోపణలు చేస్తున్నారు.

గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు..!- సీఎం రేవంత్ రెడ్డి

Formula E Race Scam (Photo Credit : Google)

Updated On : November 12, 2024 / 11:58 PM IST

Formula E Race Scam : ఫార్ములా ఈ-రేస్ స్కామ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్కామ్ నుంచి తప్పించుకునేందుకే మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆయన ఆరోపించారు. తెలంగాణ గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు ఉంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

‘గవర్నర్ ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ చుట్టూ కేటీఆర్ తిరుగుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి బంధం బయటపడుతుంది. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది. విచారణకు సమాధానం చెప్పకుండా ఎదురుగా దాడికి దిగుతున్నారు. సృజన్ రెడ్డి ఉపేందర్ రెడ్డి అల్లుడు. ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ హయాంలో సృజన్ రెడ్డికి వేల కోట్ల పనులు ఇచ్చారు. అమృత్ పథకం గురించి ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమనండి. కోర్టులో కేసులు వేస్తామన్నా వేసుకోమనండి.

కేటీఆర్ కుటుంబం దోచుకున్న విషయాలు చర్చించకుండా ఉండడానికి నా మీద ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రెడ్డి అయినా నాకు దూరంగానో దగ్గరగానో నాకు బంధువు అవుతారు. రెడ్డిలు అయినంత మాత్రాన నా బంధువులనో నేను వర్క్స్ ఇచ్చా అనో అంటే సరికాదు. కేటీఆర్ చెప్పినట్లు ఉంటే న్యాయ పోరాటం చేయాలి. బీజేపీ అవినీతి పార్టీ అనే బీఆర్ఎస్.. వారి వద్దకు వెళ్లి లేఖలు ఇస్తున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయొద్దంటే మోడీకి వేయమనే కదా? బీఆర్ఎస్ నేతలు మెదడు కోల్పోయారు. వారి గురించి జాలిపడటం తప్ప చేసేదేమీ లేదు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..