నేను ఫామ్‌హౌస్ సీఎంను కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని.. ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళతా : సీఎం రేవంత్ రెడ్డి

నేను ఫామ్ హౌస్ సీఎంను కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీ వెళ్తా. మూసీ సుందరీకరణ.. తెలంగాణ రూపు రేఖలు మార్చుతుందని రేవంత్ అన్నారు.

నేను ఫామ్‌హౌస్ సీఎంను కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని.. ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళతా : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

Updated On : September 17, 2024 / 11:05 AM IST

CM Revanth Reddy : నేను ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిని కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఎన్ని సార్లు అయినా ఢిల్లీకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరు 17న ప్రజాపాలన దినోత్సవం జరపాలని నిర్ణయించామని, విలీనం, విమోచనం అంటూ స్వప్రయోజనాల కోసం ప్రవర్తించడం సరికాదని అన్నారు. సాయుధ పోరాటానికి దొడ్డి కొమరయ్య బీజం వేశారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడారు. నిజాంపై దాశరధి వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి చదివి వినిపించారు.

Also Read : TPCC Working President : టీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్టుకు ఫుల్లు గిరాకీ!

సెప్టెంబర్ 17 ను ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవడం సముచితం. నాడు తెలంగాణ ప్రలజ విజయం .. అందుకే ప్రజాపాలన దినోత్సవం జరుపుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనిపై రాజకీయాలు చేయడం సరికాదు. ఇది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష. ఇది మా పార్టీనో.. వ్యక్తిగతం కాదు.. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పిడికిలి అని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లు నియంత పాలన సాగింది. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నియంత పాలనను గద్దెదించామని సీఎం రేవంత్ అన్నారు. యువత ఆకాంక్షలు, అమరుల ఆశయాలు ఉండాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ అంటే నా కుటుంబం గత పాలకులు భావించారు. నిజాంను మట్టి కరిపించిన భూమి తెలంగాణ. టీఎస్ నుంచి టీజీ కేవలం అక్షర మార్పు కాదు.. ప్రజల ఆకాంక్ష అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : CM Revanth Reddy: గణేశ్ నిమజ్జనంలో సీఎం రేవంత్ రెడ్డి మనవడు డ్యాన్స్ చూశారా.. మురిసిపోయిన రేవంత్.. వీడియో వైరల్

నేను ఫామ్ హౌస్ సీఎంను కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీ వెళ్తా. మూసీ సుందరీకరణ.. తెలంగాణ రూపు రేఖలు మార్చుతుందని రేవంత్ అన్నారు. పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం. యంగ్ ఇండియా స్కిల్, స్పోర్ట్స్ యూనివర్శిటీ దేశానికే ఆదర్శంగా నిలుస్తాయి. పర్యావరణ పరిరక్షణ కోసం హైడ్రాను తెచ్చాం. హైడ్రా విపత్ర కార్యం. హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయాలు, స్వార్థం లేదు. హైడ్రాను కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగదు. నేను మాట ఇస్తున్నా.. ప్రజలు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.