Hyderabad: హైదరాబాద్ లో ‘రాజ్యాంగం-మనుస్మృతి’పై సదస్సు.. కవులు, ప్రజాసంఘాల నేతలతో పాటు మరో 50 మంది అరెస్టు
హైదరాబాద్ లోని ఇవాళ స్వేచ్ఛ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 'రాజ్యాంగం-మనుస్మృతి'పై సదస్సు నిర్వహించారు. అయితే, ఈ సదస్సు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. స్వేచ్ఛ జేఏసీ, పీడీఎస్యూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రవీంద్ర భారతితో పాటు ట్యాంక్ బండ్ పై వారిని పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు.

Hyderabad: హైదరాబాద్ లోని ఇవాళ స్వేచ్ఛ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ‘రాజ్యాంగం-మనుస్మృతి’పై సదస్సు నిర్వహించారు. అయితే, ఈ సదస్సు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. స్వేచ్ఛ జేఏసీ, పీడీఎస్యూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రవీంద్ర భారతితో పాటు ట్యాంక్ బండ్ పై వారిని పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు.
పలువురు కవులు, ప్రజాసంఘాల నేతలతో పాటు మరో 50 మంది అరెస్టయ్యారు. వారిలో రచయిత సతీశ్ చందర్, కవి, గాయకుడు జయరాజ్, స్వేచ్ఛ జేఏసీ కన్వీనర్ రమేశ్ కూడా ఉన్నారు. సైఫాబాద్ లోని అంబేద్కర్ రీసెర్చ్ కాంప్లెక్స్ లో ‘రాజ్యాంగం-మనుస్మృతి’పై సదస్సు నిర్వహించారు.
అనంతరం వారంతా కలిసి అంబేద్కర్ విగ్రహం వద్దకు ఓ విషయంలో ఆందోళన చేయడానికి వెళ్లాలని అనుకోవడం వల్ల పోలీసులు వారిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు చేస్తున్న సమయంలో స్వేచ్ఛ జేఏసీ, పీడీఎస్యూ నేతలు మండిపడడంతో ఉద్రిక్తత నెలకొంది. అరెస్టులపై పలు సంఘాల నేతలు మండిపడుతున్నారు. కవులు, ప్రజాసంఘాల నేతలను అక్రమంగా అరెస్టు చేశారని అంటున్నారు.
3 MBBS students Dies: నదిలో కొట్టుకుపోయి ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థుల మృతి