Telangana Congress: ఇక సమరమే.. తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్.. కర్ణాటక ఎన్నికల వ్యూహాలను అమలుచేస్తూ ముందుకు..

నాలుగు నెలల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధమయ్యారు.

Telangana Congress: ఇక సమరమే.. తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్.. కర్ణాటక ఎన్నికల వ్యూహాలను అమలుచేస్తూ ముందుకు..

TS Congress

Updated On : June 28, 2023 / 8:28 AM IST

TS Congress Party: తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. బీఆర్ఎస్ పార్టీని గద్దెదించేది తామే అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీమాను వ్యక్తం చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతోపాటు మంగళవారం రాహుల్ గాంధీతో రాష్ట్ర ముఖ్యనేతల సమావేశం తరువాత ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఢిల్లీలో రాహుల్ తో సమావేశం తరువాత కాంగ్రెస్ నేతలు ఐక్యతారాగాన్ని అందుకున్నారు. కలిసికట్టుగా ఎన్నికల రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.

Rahul Gandhi : పార్టీ కోసం ఎవరు ఏం చేశారో నాకు తెలుసు : టీ.కాంగ్రెస్ నేతలకు రాహల్ గాంధీ చురకలు, వార్నింగులు

నాలుగు నెలల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేసింది. బీఆర్ఎస్‌తో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పొత్తు లేదని కాంగ్రెస్ కేంద్ర అధిష్టానం స్పష్టం చేయడంతో.. ‘కుటుంబ పాలన కావాలా?.. ప్రజా పాలన కావాలా? అనే నినాదంతో బీఆర్ఎస్ టార్గెట్‌గా కాంగ్రెస్ నేతలు ప్రజల వద్దకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ, అవినీతి ప్రజలకు వివరించాలని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనని రాహుల్, ఖర్గేలు రాష్ట్ర పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాహుల్ ఆదేశాలతో నేతలంతా కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు.

Rahul Gandhi: బైక్ మెకానిక్‌లా మారిన రాహుల్ గాంధీ .. సుమారు గంటన్నర పాటు కరోల్‌బాగ్‌లోనే.. ఫొటోలు వైరల్

ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొని గతంలో ఎప్పుడూలేని స్థాయిలో అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ దక్కించుకుంది. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల వ్యూహాలను తెలంగాణలోనూ అవలంభించేందుకు టీ కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. మరోవైపు సంస్థాగతంగా పార్టీ బలోపేతం, ఖాళీగా ఉన్న పదవులను టీపీసీసీ భర్తీ చేయనుంది. కర్ణాటక గెలుపు, నూతన చేరికలు, అధిష్టానం ఫోకస్‌తో తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. ఖమ్మంలో జులై 2న జరిగే బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు రాష్ట్ర పార్టీ అధిష్టానం సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో జూలై 2న జరిగే సభకు సంబంధించిన సభాస్థలిని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు బుధవారం పరిశీలించనున్నారు.