BJP MLA : దుబ్బాకలో పోలీసులు ఒకటి కొడితే..మనోళ్లు రెండు కొట్టారు..మాస్కులు పెట్టుకోకుండా తప్పించుకున్నాం

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికల్లో పోలీసులు ఒకటి కొడితే..మా బీజేపీ పార్టీ వారు రెండు కొట్టారు అంటూ వ్యాఖ్యానించారు. మాస్కులు పెట్టుకోకుండా మానేజ్ చేశామని..మాస్కులు కాకుండా సీసీ కెమెరాల కంట్లో కూడా పడకుండా మనేజా చేశామని వ్యాఖ్యానించారు.

BJP MLA : దుబ్బాకలో పోలీసులు ఒకటి కొడితే..మనోళ్లు రెండు కొట్టారు..మాస్కులు పెట్టుకోకుండా తప్పించుకున్నాం

Mla Raghunandan Rao

Updated On : June 24, 2021 / 3:39 PM IST

BJP MLA Raghunandan Rao : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక్ ఎన్నికల్లో పోలీసులు ఒకటి కొడితే..మా బీజేపీ పార్టీ వారు రెండు కొట్టారు అంటూ వ్యాఖ్యానించారు. హుజూరా బాద్ ఎన్నికల కోసం బీజేపీ శక్తి కేంద్రాల ఇన్ చార్జ్ ల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న రఘునందన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈకరోనా కాలంలో నిబంధనలు కారణంగా మాస్కులు పెట్టుకోకుండా మానేజ్ చేశామని..మాస్కులు కాకుండా టవల్స్ చుట్టుకుని సీసీ కెమెరాల కంట్లో కూడా పడకుండా మనేజా చేశామని అలా పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాం అంటూ వ్యాఖ్యానించారు.

అచ్చు ఇటువంటి యుద్ధమే హుజూరాబాద్ ఎన్నికల్లో జరుగుతుందని..ఒకరకంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే జరుగుతుందని అన్నారు. పోలీసుల కంటే బీజేపీ నేతలు రెండు ఆకులు ఎక్కువే చదివారని.. హుజూరాబాద్ ఎన్నికల్లో అంతకు మించి జరుగుతుందని అన్నారు.

కాగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. హుజూరాబాద్ నియోజక వర్గం ఎమ్మెల్యే పదవి అటు టీఆర్ఎస్ కు ఇటు బీజేపీ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సీటును దక్కించుకోవటం రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా జరుగనుంది.

దీంట్లో బాగంగా బీజేపీ పార్టీ వ్యూహాలతో బిజీబిజీగా ఉంటే ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా తమదైన శైలిలో సీటు దక్కించుకుని అటు ఈటల రాజేందర్ కు ఇటు బీజేపీకి ఝలక్ ఇవ్వటానికి కసరత్తులు చేస్తోంది. మరి హుజూరాబాద్ సీటు ఎవరికి దక్కనుందో మరి.