జాగ్రత్త : హోం క్వారంటైన్ నుంచి తప్పించుకున్న పాతబస్తీ యువకుడు

  • Published By: madhu ,Published On : March 30, 2020 / 12:53 AM IST
జాగ్రత్త : హోం క్వారంటైన్ నుంచి తప్పించుకున్న పాతబస్తీ యువకుడు

Updated On : March 30, 2020 / 12:53 AM IST

కరోనా వ్యాధి అత్యంత ప్రమాదకరం. దీనికి మందు లేదు. ఏదైనా ఉందంటే వైరస్ సోకిన వ్యక్తి..క్వారంటైన్ లో ఉండాలి..ఎవరితో కలవద్దు..14 రోజుల పాటు ఇలాగే ఉండాలి..వీరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటాం..ప్లీజ్ సహకరించండి..అంటూ తెలుగు రాష్ట్రాల పాలకులు, వైద్యాధికారులు, నిపుణులు ఎంతో మంది వేడుకుంటున్నా,  సూచనలిస్తున్నా కొంతమంది బేఖాతర్ చేస్తున్నారు.

వీరి ఫలితంగా ఇతరులకు వ్యాధి సోకుతూ..కేసులు అధికమౌతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన ఓ యువకుడు ఇలాగే చేశాడు. క్వారంటైన్ నుంచి తప్పించుకుని విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. పోలీసులు ఇతడిని పట్టుకోవడానిక ప్రయత్నిస్తున్నారు. 
 

వివరాల్లోకి వెళితే…
పాతబస్తీ ప్రాంతానికి చెందిన నవాబ్ ఖురేషీ..ఇటీవలే లండన్ నుంచి వచ్చాడు. ఇతనికి ఎయిర్ పోర్టులో స్ర్కీనింగ్ టెస్టు చేయగా..కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆ యువకుడిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ ఎలా తప్పించుకున్నాడో తెలియదు.

కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సంచరిస్తున్నాడు. ఈ విషయం స్థానికులకు తెలిసింది. వెంటనే పోలీసులు, అధికారులకు తెలియచేశారు. ప్రస్తుతం నవాబ్ ఖురేష్ ఎక్కడున్నాడనే దానిపై ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల్లో ఇతను తిరుగుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.