కరోనాతో నగరంలో తగ్గిన పొల్యూషన్

కరోనా భయపెడుతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఎంతో మంది కబళించి వేస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో జనాలు కూడా మేల్కొన్నారు. అప్రమత్తమయ్యారు.
ప్రభుత్వం చెబుతున్నట్లుగా వింటున్నారు. చాలా మంది ఇళ్లలోనే ఉండిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ తీసుకున్న కఠిన నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.కానీ కేసుల సంఖ్య మాత్రం పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇదిలా ఉంటే…నగరంలో కాలుష్యం క్రమక్రమంగా తగ్గిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విడుదల చేసిన వాయు నాణ్యత సూచీ…నివేదిక స్పష్టం చేస్తోంది. వాహనాలు రోడ్డెక్కకపోవడం వల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు. హైదరాబాద్ లో ప్రతి రోజు 50 లక్షలకు ఎక్కువగానే వాహనాలు రయ్యి రయ్యిమంటు తిరుగుతుంటాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంతో ఆంక్షలు అమల్లో ఉంటుండడంతో వాహనాలు తీసుకుని రోడ్డు పైకి రావడం లేదు.
అవసరమైతే తప్ప..బయటకు రావడం లేదు. దీంతో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని అధికారులు వెల్లడించారు. 2020, మార్చి 22వ తేదీ ఆదివారం వాయు కాలుష్యం సూచీ 94 ఉండగా…2020, మార్చి 25వ తేదీ బుధవారం రోజు 60కి చేరింది. మరిన్ని రోజులు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే..కాలుష్యం తగ్గి..పీల్చే గాలి స్వచ్చంగా మారుతుందని వెల్లడించారు. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి.
See Also | ఈ ఖాకీ గుండె ఎంత మంచిదో: గర్భిణి కోసం కారు ఇచ్చేసి!