విశాఖలో ఇద్దరు చిన్నారులను చంపేసి దంపతుల ఆత్మహత్య

  • Published By: madhu ,Published On : September 10, 2020 / 08:33 AM IST
విశాఖలో ఇద్దరు చిన్నారులను చంపేసి దంపతుల ఆత్మహత్య

Updated On : September 10, 2020 / 11:13 AM IST

విశాఖ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ లాడ్జీలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాడ్జీ సిబ్బంది అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు.



సూసైడ్ చేసుకున్నది బి.అప్పలరాజు కుటుంబంగా గుర్తించారు. భార మానస, కుమారుడు సాత్విక్ (5), కుమార్తె కీర్తి (6) చనిపోయిన వారిలో ఉన్నారు.
https://10tv.in/father-who-killed-son-rs-30/
పెందుర్తి ప్రాంతానికి చెందిన అప్పలరాజు తన కుటుంబసభ్యులతో విశాఖలోని లాడ్జీలో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. 2020, సెప్టెంబర్ 09వ తేదీ బుధవారం రాత్రి వీరి ఉంటున్న గది తలుపులు ఎంతకు తెరవకపోవడంతో లాడ్జీ సిబ్బందికి అనుమానం కలిగింది.



వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.
బలవంతంగా తలుపులు తీయగా..నలుగురు విగతజీవులుగా పడి
ఉండడం గమనించారు. గదిలో సూసైడ్ నోట్ ను గుర్తించారు. అప్పుల భారంతోనే తాము ఆత్మహత్యకు పాల్పడినట్లు అప్పలరాజు వెల్లడించాడు. అప్పలరాజు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తొలుత చిన్నారులను ఉరి వేసి..దంపతులు ఉరి వేసుకుని చనిపోయినట్లు సమాచారం.