Dasoju Srravan : కేసీఆర్ అలా అన్నారని.. ప్రధాని మోదీ భాగ్యలక్ష్మి గుడిలో ప్రమాణం చేయగలరా?- దాసోజు శ్రవణ్ సవాల్

తన వైఫల్యాలను కప్పి పుచ్చుకుంటూ మోదీ అబద్దాలు మాట్లాడారు. బట్ట కాల్చి కేసీఆర్ మీద వేశారు. Dasoju Srravan

Dasoju Srravan : కేసీఆర్ అలా అన్నారని.. ప్రధాని మోదీ భాగ్యలక్ష్మి గుడిలో ప్రమాణం చేయగలరా?- దాసోజు శ్రవణ్ సవాల్

Dasoju Srravan criticise pm modi

Updated On : October 4, 2023 / 6:56 PM IST

Dasoju Srravan – PM Modi : తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ప్రధాని చేసిన కామెంట్స్ బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య చిచ్చు రాజేశాయి. మాటల యుద్ధానికి దారితీశాయి. ఎన్డీయేలో చేరతామని కేసీఆర్ తనతో అన్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మద్దతు కోరారని, కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తాను అందుకు సపోర్ట్ చేయాలని తనతో కేసీఆర్ చెప్పారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. మోదీ వ్యాఖ్యలను వారంతా ముక్తకంఠంతో ఖండించారు. ప్రధాని మోదీ పచ్చి అబద్దాలు చెప్పారని ఎదురుదాడికి దిగారు. తాజాగా ప్రధాని వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు.

ఓట్ల కోసం దిగజారిపోయారు..
”ఓట్ల కోసం అడ్డమైన గడ్డి తిన్నట్టు బీజేపీ నాయకులు, ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. నిన్న తన వైఫల్యాలను కప్పి పుచ్చుకుంటూ మోదీ అబద్దాలు మాట్లాడారు. బట్టకాల్చి కేసీఆర్ మీద వేశారు. నరేంద్ర మోదీ దేశ ప్రధాని హోదాలో అబద్దాల కోరు బిరుదు తెచ్చుకున్నారు. అహంకారానికి, ఆధిపత్యానికి, అణిచివేతకు మోదీ మారుపేరు. మోదీ అబద్దాల కేడీ అని నిరూపించుకున్నారు. కొండంత రాగం తీసి పనికిమాలిన పాట పాడినట్టు రహస్యం చెబుతా అని అబద్దాలు చెప్పారు.

Also Read..BJP: ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?

బీజేపీది జాతీయవాదం కాదు గుజరాతీ వాదం..
గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్ మోదీని కలిసి మద్దతు అడిగినట్టు చెప్పారు. మాకు ఏం అవసరమని మోదీ, బీజేపీ మద్దతు అడుగుతాము. ఎన్నికల ముందే మేము ఎంఐఎం కలిసి పోటీ చేశాము. ఇద్దరం కలిస్తే మేయర్ పీఠం మాదే కదా. బీజేపీ నేతలు, ప్రధాని మోదీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణను ఓ గుజరాతీ విముక్తి చేశాడని, మరో గుజరాతీ డెవలప్ చేస్తున్నాడని ప్రచారం చేస్తున్నారు. బీజేపీది జాతీయవాదం కాదు గుజరాతీ వాదం. రాజకీయాల్లో, వ్యాపారంలో గుజరాతీయుల ఆధిపత్యమే నడవాలనుకుంటున్నారు.

కేటీఆర్ సీఎం కావాలనుకుంటే ఆపేవారు ఎవరు?
హిట్లర్, గోబెల్స్ ఆత్మలు మోదీలో చొరబడ్డాయి. మోదీ దుర్మార్గమైన వాదనలు తెలంగాణ వాసులు తిప్పికొట్టాలి. మేము ఎప్పుడూ బీజేపీ మద్దతు కోరలేదు. ఎన్డీయేలో చేరతామని అనలేదు. గతంలో బీజేపీనే బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తామని అప్పటి అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నాడు మాకు బీజేపీ మద్దతు అవసరమే లేదని వినోద్ కుమార్ తేల్చి చెప్పారు. కేటీఆర్ సీఎం కావాలనుకుంటే ఆపేవారు ఎవరు? కేసీఆర్, తెలంగాణ మద్దతుతో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.

మోదీ మాటలు, చదువు, వయసు అన్నీ అబద్దాలే..
మోదీ మాటలు, చదువు, వయసు అన్నీ అబద్దాలే. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ కుటుంబ పార్టీ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో వారితో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారు. బీజేపీలో అనేక మంది డైనాస్టీ నాయకులున్నారు.
కేటీఆర్, హరీశ్ రావు, కవిత.. ఉద్యమాలు, రాజకీయాల నుంచి వచ్చారు.

Also Read..Jagtial: జగిత్యాల త్రిముఖపోరులో గట్టెక్కేదెరో.. జీవన్‌రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారా?

2014 నుంచి బీఆర్ఎస్ పసుపు బోర్డు కోసం పోరాటం చేస్తోంది. ఓట్ల కోసం, పార్టీ చచ్చిపోతుందని గతంలో ఇచ్చిన హాలీలు అమలు చేస్తామంటున్నారు. కొత్త ట్రిబునల్ ఆలస్యంగా వేశారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకివ్వరు? కేసీఆర్ ఎన్డీఏలో చేరతారని అన్నట్టు మోదీ భాగ్యలక్ష్మి గుడిలో ప్రమాణం చేయాలి.

రేవంత్ రెడ్డిని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్చాలి..
రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాల కోరు. రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్ట్. బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు. రేవంత్ రెడ్డిని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్చాలి. రేవంత్ పై ఐటీ కేసులు ఏమయ్యాయి? ఈడీ, సీబీఐ ఎందుకు పిలవడం లేదు? చిల్లర మాటలకు చిరునామ రేవంత్ రెడ్డి” అని నిప్పులు చెరిగారు దాసోజు శ్రవణ్.