బండారు దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తక ఆవిష్కరణ.. ప్రముఖుల ఆసక్తికర కామెంట్స్
"నేను ఈ స్థాయికి ఎదిగానంటే అందులో ఇంద్రసేనా రెడ్డి తోడ్పాటు ఉంది" అని దత్తాత్రేయ అన్నారు.

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఇవాళ హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పుస్తక ఆవిష్కరణ చేసి ఈ కాపీలను ప్రముఖులకు అందజేశారు భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, త్రిపురా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, కేంద్రమంత్రులు శ్రీనివాస్ శర్మ, కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
అలాగే, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్, తదితరులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. పుస్తకం రాయాలని నేను అనుకోలేదు. కానీ నా అనుభవాలు రాయాలని చాలామంది చెప్పారు. కొవిడ్ సమయంలో ముందుగా విడియో రికార్డు చేసి తరువాత పుస్తక రూపంలో తీసుకు వచ్చాం. రాయిలాంటి నన్ను మనోహర్ షిండే అనే నాయకుడు శిల్పంగా మార్చారు.
Also Read: అధిక ఒత్తిడికి గురవుతున్నారా? అయితే వీటికి దూరంగా ఉండండి
నన్ను ఆరెస్సెస్ కు పరిచయం చేసిన వ్యక్తి మనోహర్. నన్ను రాజకీయలోకి తెచ్చిన వ్యక్తి వీ రామారావు. నేను ఈ స్థాయికి ఎదిగానంటే అందులో ఇంద్రసేనా రెడ్డి తోడ్పాటు కూడా ఉంది. నేను ఎదగడానికి కారణం బీజేపీ కార్యకర్తలు. వారి కృషితో కేంద్ర మంత్రిని అయ్యాను. కార్యకర్తలకు నేను ఎంతో రుణపడి ఉంటాను.. వారి కోసం పని చేస్తా” అని అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… “అలయ్ బలయ్ అంటేనే గుర్తు వచ్చేది బండారు దత్తాత్రేయ. ఈ కార్యక్రమం నాకు ఎంతో ప్రత్యేకం. అజాత శత్రువు బండారు దత్తాత్రేయ. ప్రజల కథే నా ఆత్మ కథ.. అంటేనే ఆయన ప్రజలకు ఎంత దగ్గర ఉంటారో అర్థం అవుతుంది. ఈ కార్యక్రమనికి వస్తే పాత రోజులు నాకు గుర్తు వస్తున్నాయి.
సాధారణ కార్యకర్త దేశ నేత స్థాయికి ఎదిగిన నేత దత్తాత్రేయ. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో కార్యక్రమాలతో ఆయన ప్రజల పక్షాన పోరాటాలు చేశారు. ఆదర్శమైన రాజకీయ జీవితం అంటే బండారు దత్తాత్రేయ. సంఘ్ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్ గా ఆయన అనేక పదవులు చేపట్టినప్పటికీ ఆయన ఓ సాధారణ కార్యకర్తగా ఉంటారు. 65 ఏండ్లు ప్రజలకు సేవలు చేశారు. వివిధ సమస్యలపై లేఖలు రాస్తూ లేఖల రాయుడుగా పేరు తెచ్చుకున్నారు” అని చెప్పారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. “ఒక లక్ష్యంతో, అంకిత భావంతో పని చేసే వారి సంఖ్య తగ్గుతుంది. బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ప్రజలకు అవసరం. నన్ను కూడా ఆత్మకథ రాయాలని అడిగారు.. నేను రాయను అని చెప్పాను. ఆత్మకథ రాస్తే చాలా నిజాలు చెప్పాల్సి వస్తుంది అని చెప్పాను. బండారు దత్తాత్రేయ ప్రజల కథే నా ఆత్మకథ అంటూ రాశారు.
నేను బండారు దత్తాత్రేయ ఓకే దగ్గర సంస్కరిచబడ్డాం.. అదే ఆరెస్సెస్.. ఈ రోజు ఆరెస్సెస్ పై కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆరెస్సెస్ లో నేర్చుకున్న అనేక అంశాలు, సేవ లాంటి కార్యక్రమలు చేశాం. పదవిలో ఉన్నా, పదవిలో లేకున్నా దత్తాత్రేయ తామర ఆకు మీద నీటి బొట్టులా ఉన్నారు. ఎన్ని పదవులు వచ్చినా ఆయన ఇంకా గంజి మనిషిగా ఉన్నారు, బెంజి మనిషిగా మారలేదు. పదవులు వచ్చినా, రాకున్నా ఆయన ఓకే పార్టీలో ఉన్నారు. కొంతమంది డైపర్లు మర్చినట్లు పార్టీలు మారుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రేమగా పిలుచుకునే వ్యక్తి దత్తన్న.. అజాత శత్రువు బండారు దత్తాత్రేయ. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు జీవన ప్రమాణాల పెరుగుదల కోసం పని చేశారు. దసరా సమయంలో అలయ్ బలయ్ కార్యక్రమంతో అని రాజకీయ పక్షాల నాయకులను ఓకే వేదికపైకి తీసుకు వస్తారు..
త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ.. “బండారు దత్తాత్రేయ మాతో కలిసిన ప్రతిసారి అనేక ముచ్చట్లు చెప్పేవారు. ఆ ముచ్చట్లు అన్ని పుస్తకం లో పెట్టారు..ఈ పుస్తకం నాగురించి కూడా ప్రస్తావన చేశారు. ఎమర్జెన్సీ సమయంలో మేము ఇద్దరం కలిసి పాల్గొన్న సంఘటన ప్రస్తావించారు” అని చెప్పారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. “హైటెక్ సిటీ పేరు చెప్పినా, హైదరాబాద్ పేరు చెప్పినా మొదటగా గుర్తు వచ్చేది చంద్రబాబు. అజాత శత్రువు, అందరూ ప్రేమించే వ్యక్తి బండారు దత్తాత్రేయ. ఇప్పటికీ ఎక్కడ కలిసినా ఆత్మీయంగా పలకరిస్తారు.