Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అందుకు కోర్టు అనుమతి
జైల్లోకి ల్యాప్ టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది.

Delhi Liquor Case
Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. వచ్చే వారం కవితను తీహార్ జైల్లో ప్రశ్నించబోతున్నారు సీబీఐ అధికారులు. జైల్లోకి ల్యాప్ టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవితను ప్రశ్నించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించాలని కోర్టు ఆదేశించింది.
బుచ్చిబాబు ఫోన్ నుండి రికవరీ చేసిన వాట్సాప్ చాట్స్ పై కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆప్ కి చెల్లించిన 100కోట్ల ముడుపులు సహా లిక్కర్ కేసు దర్యాప్తులో నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ పై కవితను క్వశ్చన్ చేయనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితను సీబీఐ ప్రశ్నించబోతోంది. కవితను ప్రశ్నించేందుకు తమకు అవకాశం కల్పించాలని, కవితను ప్రశ్నలు అడిగేందుకు అనుమతి ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అప్లికేషన్ దాఖలు చేసింది. దీనికి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. వచ్చే వారం కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి పర్మిషన్ ఇచ్చింది కోర్టు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాఫ్తు జరుపుతోంది. మనీలాండరింగ్ వ్యవహారంపై ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) దర్యాఫ్తు జరుపుతోంది. ఈ కేసులో సీబీఐ మొదట ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. 2022 ఆగస్టు 15న ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ను సీబీఐ దాఖలు చేసింది. అయితే, ఎఫ్ఐఆర్ లో కవిత పేరు లేదు. ఆ తర్వాత విచారణలో భాగంగా కవిత పాత్రపైనా సీబీఐ దృష్టి పెట్టింది.
2022లోనే డిసెంబర్ లో కవితను ఆమె నివాసంలో ఏడు గంటల పాటు సీబీఐ ప్రశ్నించింది. ఆ తర్వాత ఈ ఏడాది మళ్లీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 26న సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తాను ఎన్నికల్లో బిజీగా ఉంటానని, విచారణకు హాజరుకావడం లేదని కవిత ఒక లేఖను పంపారు. తాజాగా ఈడీ కేసులో అరెస్ట్ అయిన కవితను.. కోర్టు అనుమతితో తీహార్ జైల్లో ప్రశ్నించబోతున్నారు సీబీఐ అధికారులు. వచ్చే వారం ఏదో ఒక రోజు కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, తీహార్ జైలుకి వెళ్లడానికి ఒకరోజు ముందు తీహార్ జైలు అధికారులకు సీబీఐ అధికారులు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సీబీఐ అధికారులతో పాటు ఒక లేడీ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉంటారు.
Also Read : ఏపీలోని 5 విలీన గ్రామాలను తెలంగాణలో తిరిగి కలుపుతాం: కాంగ్రెస్