Errabelli Dayakar Rao: మా పార్టీ కాకపోయినా రాహుల్‌కు మద్దతు తెలిపాం.. రాహుల్ విషయంలో రేవంత్ స్పందన సరిగ్గా లేదు: మంత్రి ఎర్రబెల్లి

రాహుల్ గాంధీపై అనర్హత రాజ్యాంగ విరుద్ధం. ఇది హీనమైన చర్య. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యలతో ఎమర్జెన్సీ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. రాహుల్ గాంధీ మా పార్టీ కాకపోయినా ప్రజాస్వామ్య పటిష్టతకు ఆయనకు మద్దతు తెలిపాం.

Errabelli Dayakar Rao: మా పార్టీ కాకపోయినా రాహుల్‌కు మద్దతు తెలిపాం.. రాహుల్ విషయంలో రేవంత్ స్పందన సరిగ్గా లేదు: మంత్రి ఎర్రబెల్లి

Updated On : March 25, 2023 / 7:09 PM IST

Errabelli Dayakar Rao: తమ పార్టీ కాకపోయినా ప్రజాస్వామ్య పటిష్టత కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత విషయంలో ఆయనకు మద్దతు తెలిపినట్లు చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాహుల్ అనర్హత విషయంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సరిగ్గా స్పందించలేదని ఎర్రబెల్లి అన్నారు.

Bandi Sanjay: బండి సంజయ్ తనయుడికి ఊరట.. యూనివర్సిటీ సస్పెన్షన్‌పై స్టే.. పరీక్షలకు అనుమతి

ఈ అంశంపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాహుల్ గాంధీపై అనర్హత రాజ్యాంగ విరుద్ధం. ఇది హీనమైన చర్య. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యలతో ఎమర్జెన్సీ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో సాక్షాలు అడిగారు. ఇవ్వకపోతే కేసులు పెట్టొచ్చు. ఇక్కడ తెలంగాణలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారు. అసత్యపు ఆరోపణలు చేస్తున్న వీళ్ళను ఏం చేయాలి? రేవంత్ రెడ్డికి సిగ్గుందా… రాహుల్ గాంధీ మాట్లాడింది తక్కువే. రేవంత్ అంతకంటే ఎక్కువ అసత్యపు ఆరోపణలు చేశాడు.

ISRO: ఇస్రో రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్.. ఆదివారం ఒకే రోజు 36 ఉపగ్రహాల ప్రయోగం

లీకేజీలతో 100 మంది పాస్ అయ్యారంటున్నాడు. ఆయనకు సిగ్గుంటే ఆధారాలు చూపండి. అబద్దాలు, తప్పుడు ఆరోపణలు చేసిన వారు ఎవరైనా కేసులకు అర్హులే. పాపం రాహుల్ గాంధీ మా పార్టీ కాకపోయినా ప్రజాస్వామ్య పటిష్టతకు ఆయనకు మద్దతు తెలిపాం. రాహుల్‌పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై రేవంత్ రెడ్డి ఇంతవరకు సరిగా స్పందించలేదు. రేవంత్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఓటుకు నోటు కేసులో కేంద్రం తనపై దృష్టి పెడుతుందని రేవంత్ భయపడుతున్నట్టుంది.

రేవంత్ రెడ్డి బీజేపీని అనడానికి చంద్రబాబుతో ఉన్న లింకులు అడ్డొస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో అటు చంద్రబాబు, ఇటు రేవంత్ పూర్తిగా ఇరుక్కుపోయారు. దీన్ని కేంద్రం బయటకు తీస్తుందని భయంతో రేవంత్ బిజెపిని ఏం అనలేకపోతున్నట్టుంది. రేవంత్ రెడ్డి సెటిల్మెంట్ల పెద్దమనిషి. బ్లాక్ మెయిల్ చేయడంలో పర్ఫెక్ట్’’ అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.