Harish Rao: నోరు జారొద్దు, నోరు జారిన మాట వెనక్కి తీసుకోలేము- కవితకు హరీశ్ రావు కౌంటర్..!

ఎదుటి వాడి మనసు ఒక్కసారి బాధపడితే, అది కలుక్కుమన్నాక దాని అతుకుడు చాలా కష్టమైతుంది. Harish Rao

Harish Rao: నోరు జారొద్దు, నోరు జారిన మాట వెనక్కి తీసుకోలేము- కవితకు హరీశ్ రావు కౌంటర్..!

Harish Rao Representative Image (Image Credit To Original Source)

Updated On : January 6, 2026 / 6:05 PM IST
  • మన నాలుక చాలా ముఖ్యం
  • నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి
  • నోటి నుంచి బయటకు పోయిన మాట మళ్లీ వెనక్కి తీసుకోలేము
  • మాట జారినా, నడవడిక బాగోకపోయినా లాభం లేదు

 

Harish Rao: నూతన సర్పంచ్ ల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మండలిలో కవిత చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నోరు జారొద్దు అని హరీశ్ రావు సూచించారు. నోరు జారిన మాట వెనక్కి తీసుకోలేము అని తేల్చి చెప్పారు. నోరును బాగా అదుపులో పెట్టుకోవాలన్నారు. ఇంకేదైనా పోతే వస్తుంది.. కానీ నోటి నుంచి బయటకు పోయిన మాట మళ్లీ వెనక్కి తీసుకోలేమున్నారు. పదవి పోతే వస్తుందేమో, పైసలు పోతే వస్తాయేమో కానీ జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము అని వ్యాఖ్యానించారు.

గెలిచాం కదా అని మాట మార్చొద్దు, బట్టలు మార్చొద్దు..

”మనం ప్రజా సేవకులం. సేవ చేసేందుకు ప్రజలు మనకిచ్చిన అవకాశం. ప్రజల నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. ఎదిగితే ఒదగాలి. పదవి అనేది బాధ్యతను పెంచుతుంది. గెలిచాం కదా అని మనం మాట మార్చొద్దు, బట్టలు మార్చొద్దు, మన విధానంలో మారొద్దు, మన పనితనంలో మార్పు రావొద్దు. మరింత సంయమనంతో, మరింత ప్రేమతో, మరింత ఓపికగా పని చేద్దాం.

కొన్ని పనులు అవుతాయి, కొన్ని లేట్ అవుతాయి. మీకు ఐదేళ్ల పదవీ కాలం కదా. తొందర ఏముంది. చేయగలిగింది చేసుకుంటూ వెళ్దాం. ఇంకో రెండేళ్లు అయితే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. మిగిలిపోయినవి ఉంటే లాస్ట్ రెండు మూడేళ్లు చేద్దాం. మీరు ఎక్కడా ధైర్యం కోల్పోవద్దు. ప్రజలకు కూడా మనం స్పష్టంగా చెప్పాలి. పరిస్థితిని వివరించాలి. ఇది ఇప్పుడు చేస్తాం, ఇది మళ్లీ చేస్తాం అని మంచిగా వివరించి చెప్పండి. సర్పంచ్ లుగా బాగా పని చేసి ఎదగాలి. అవకాశం రావడం అదృష్టం. నిలబెట్టుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది.

మనసు గాయపడితే మళ్లీ అతుక్కోవడం కష్టం..

అన్నింటికంటే ముఖ్యం మన నాలుక. మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి. ఇంకేదైనా పోతే వస్తుంది కానీ నోటి నుంచి బయటకు పోయిన మాట మళ్లీ వెనక్కి తీసుకోలేము. పదవి పోతే వస్తుందేమో, పైసలు పోతే వస్తాయేమో కానీ జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము. ఎదుటి వాడి మనసు ఒక్కసారి బాధపడితే, అది కలుక్కుమన్నాక దాని అతుకుడు చాలా కష్టమైతుంది.

కనుక మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి. నా దృష్టిలో మాటే ముఖ్యం. మాట, మన మర్యాద, మన నడవడి, మన పనితనం.. పనితనం అనేది నా దృష్టిలో నాలుగోది. మాట, నడవడి, మన మర్యాదలే అన్నింటికంటే ముఖ్యమైనది. దాంతో పాటు పని. పని ఎలాగూ చేస్తాం. పని బాగా చేసినా మాట జారినా, నడవడిక బాగోకపోయినా లాభం లేదు” అని హరీశ్ రావు అన్నారు.

Also Read: వాహనాలు సీజ్ చేస్తాం- అధిక చార్జీలపై ప్రైవేట్ ట్రావెల్స్‌కు వార్నింగ్