KTR: ముగిసిన కేటీఆర్ సిట్ విచారణ.. 7 గంటలకు పైగా సాగిన ఎంక్వైరీ

గంటపాటు రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ ను విచారించారు సిట్ అధికారులు.

KTR: ముగిసిన కేటీఆర్ సిట్ విచారణ.. 7 గంటలకు పైగా సాగిన ఎంక్వైరీ

Ktr

Updated On : January 23, 2026 / 7:01 PM IST
  • కేటీఆర్ పై ప్రశ్నల వర్షం
  • 7 గంటలకు పైగా విచారణ
  • రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ ను ప్రశ్నించిన సిట్ అధికారులు

 

KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. ఏడు గంటలకు పైగా ఎంక్వైరీ సాగింది. గంటపాటు రాధాకిషన్ రావుతో (అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ) కలిపి కేటీఆర్ ను విచారించారు సిట్ అధికారులు. విచారణ ముగించుకుని జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ నెంబర్ 2గా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్, పార్టీ వ్యవహారాలు, ఆర్థిక అంశాల్లో రాధాకిషన్ రావుతో కలిసి కేటీఆర్ కొన్ని పనులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గడిచిన రెండేళ్లలో 680 మంది బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఇవాళ కేటీఆర్ విచారణ సాగినట్లు తెలుస్తోంది.

ఇవాళ ఉయదం 11 గంటలకు విచారణకు హాజరయ్యారు కేటీఆర్. 12గంటల 30 నిమిషాలకు రాధాకిషన్ రావుని తీసుకొచ్చారు సిట్ అధికారులు. ఇద్దరినీ కలిపి విచారించారు. రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు. పదవీ కాలం ముగిసినా చాలా రోజుల పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీగా కొనసాగారు రాధాకిషన్ రావు. అప్పటి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.