Bandi Sanjay Arrest : బండి సంజయ్ అరెస్ట్‌ను ఖండించిన విజయశాంతి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన తీరు సరికాదని బీజేపీ సీనియర్ నేత, పార్లమెంట్ మాజీ సభ్యురాలు విజయశాంతి అన్నారు.

Bandi Sanjay Arrest : బండి సంజయ్ అరెస్ట్‌ను ఖండించిన విజయశాంతి

Vijayasanthi

Updated On : January 3, 2022 / 2:52 PM IST

Bandi Sanjay Arrest :  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన తీరు సరికాదని బీజేపీ సీనియర్ నేత, పార్లమెంట్ మాజీ సభ్యురాలు విజయశాంతి అన్నారు. రాష్ట్ర  ప్రభుత్వం అడుగడుగునా బీజేపీ వాళ్ళను అడ్డుకుంటోందని ఆమె అంటూ…. కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చింది.. తెలంగాణ ప్రజల కోసం కాదని ఆయన కుటుంబం కోసమని ఆరోపించారు.

బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని…బండి సంజయ్‌తో పాటు కార్యకర్తల పైన పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో మా ఉద్యమాన్ని మరింత ఉథృతం చేస్తామని ఆమె చెప్పారు.

మీ మీటింగ్ లకు కరోనా ఉండదుకానీ…. బీజేపీ మీటింగ్ లకు కరోనా ఉంటుందా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని విజయశాంతి ఆరోపిస్తూ….బీజేపీ దీక్షచేసిన రోజే కాంగ్రెస్ చేస్తోందని తెలిపారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Vangaveeti Radha : వంగవీటి రాధాను కలిసిన ఎంపీ కేశినేని నాని
రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని…రైతులు, నిరుద్యోగులు,ఉద్యోగుల సమస్యల వల్ల అందరూ బయటకు వస్తున్నారు.. సమస్యలను  పక్క దారి పట్టిస్తున్నారని విజయశాంతి అన్నారు.