Suryapet: పొలం దున్నుతుండగా వరుసగా రెండు విషాదాలు.. ఇద్దరి మృతి
ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందడాన్ని చూసిన రైతు ఆందోళనకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

Suryapet
Suryapet – Farmer: తెలంగాణ(Telangana)లోని సూర్యాపేట జిల్లా అర్వపల్లి (Arvapally) మండలం పర్సాయపల్లిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పొలం దున్నుతుండగా ట్రాక్టర్ డ్రైవర్ కు ఫిట్స్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అతడు ట్రాక్టర్ కింద పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అంతేకాదు, ఆ మరు నిమిషంలోనే అక్కడే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందడాన్ని చూసిన రైతు ఆందోళనకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రైతు కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ట్రాక్టర్ డ్రైవర్ పేరు రామలింగయ్య అని, రైతు పేరు మల్లయ్య అని స్థానికులు తెలిపారు.
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ట్రాక్టర్ డ్రైవర్, రైతు మృతిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ట్రాక్టర్ డ్రైవర్ ది బొల్లంపల్లి గ్రామమని పోలీసులు గుర్తించారు. అతడు భద్రారెడ్డి అనే రైతు వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
Modi Pune Visit: మిస్టర్ క్రైం మినిస్టర్ అంటూ మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వివాదాస్పద పోస్టర్లు