శ్రీశైలం నుంచి కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్‌కు జలకళ.. రైతుల్లో ఆనందం

శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సాగర్ వైపు వరద నీరు పరుగులు పెడుతోంది.

శ్రీశైలం నుంచి కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్‌కు జలకళ.. రైతుల్లో ఆనందం

Nagarjuna Sagar

Updated On : July 9, 2025 / 10:12 AM IST

Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సాగర్ వైపు వరద నీరు పరుగులు పెడుతోంది. సాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో 1,16,424 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ఔట్ ఫ్లో 4,646 క్యూసెక్కులుగా నమోదైంది. నాగార్జున సాగర్ సాగర్ మొత్తం నీటిమట్టం 590 కాగా.. ప్రస్తుతం 534.50అడుగులకు నీటిమట్టం చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 177 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతుండటంతో ఆ ప్రాంతాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జూరాలకు వరద హోరు..
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద చేరుతుండటంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది. దీంతో 14 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్‌ప్లో 1,25,000 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,23,717 క్యూసెక్కులు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 9,657 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 7,925 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో ఐదు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దిగువ జూరాల జల ఉత్పత్తి ఆరు యూనిట్లలలో ఉత్పత్తి అవుతుంది.