KTR: నెక్ట్స్‌ ఏంటి? మలుపులు తిరుగుతున్న ఈ-కార్‌ కేసు

లీగల్ ఫైట్ చేస్తానని కేటీఆర్ చెబుతుండడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనే ఉత్కంఠను రేపుతోంది.

KTR: నెక్ట్స్‌ ఏంటి? మలుపులు తిరుగుతున్న ఈ-కార్‌ కేసు

KTR

Updated On : January 7, 2025 / 9:39 PM IST

మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలన్న పట్టుదలతో తెలంగాణ ప్రభుత్వం ఉందా.. నిర్దోషిగా బయటకు వస్తానని కేటీఆర్ ధీమాగా కనిపిస్తున్నారా.. ఇద్దరి మధ్య ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుంది. కేటీఆర్ దాఖ‌లు చేసిన క్వాష్ పిటిష‌న్‌ను హైకోర్టు డిస్మిస్ చేయ‌డంతో నెక్ట్స్ ఏంటి? అనే టెన్షన్ ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ, అటు ప్రభుత్వ వ‌ర్గాల్లోనూ మొదలైంది.

తెలంగాణ రాజ‌కీయం ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అంశం చుట్టూ తిరుగుతోంది. అన్ని రాజ‌కీయ ప‌క్షాలు ఏం జ‌రుగుతుందో అని ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నాయి. ఎత్తులు, పైఎత్తుల‌తో అధికార కాంగ్రెస్‌, బీఆర్ఎస్ రాజ‌కీయ పావులు క‌దుపుతున్నాయి.

రోజుకో మలుపు
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మొత్తం మాజీ మంత్రి కేటీఆర్ కార్నర్ అవుతూ వస్తున్నారు. బీఅర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ అవకతవకలకు పాల్పడ్డారని అధికార కాంగ్రెస్ ఆరోపణ.. ఆ రూట్‌లోనే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.

ఐతే అవన్నీ ఫాల్స్ కేసులంటూ క్వాష్‌ పిటీషన్‌తో హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్.. దాదాపు నెల రోజులు దానిపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరకు హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో పొలిటికల్ సీన్ మారింది..

కేటీఆర్ అరెస్ట్ త‌ప్పదా?
కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దని గతంలో తాత్కాలిక ఉప‌శ‌మ‌నం ఇచ్చిన హైకోర్టు ఇప్పుడు క్వాష్‌పిటిషన్‌ను కొట్టివేయంతో నెక్ట్స్ ఏంటి? అనే చర్చ మొదలైంది.. ఏసీబీ విచార‌ణ‌లో తాము జోక్యం చేసుకోలేమ‌ని హైకోర్టు తేల్చి చెప్పడంతో, కేటీఆర్ అరెస్ట్ త‌ప్పద‌నే మాట వినిపిస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం నేరుగా కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటుందా.. లేదంటే న్యాయపరమైన అంశాలపై అభిప్రాయం తీసుకుంటుందా అన్న సస్పెన్స్‌ హైటెన్షన్‌ను క్రియేట్ చేస్తోందన్నది పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట..

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ప్రభుత్వానికి కౌంటర్‌గా ఎలా ముందుకెళ్లాల‌నే అంశంపై న్యాయ నిపుణుల‌తో సీరియ‌స్‌గా క‌స‌ర‌త్తు చేస్తోంది బీఆర్ఎస్.. ఎలాంటి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని స్ట్రాంగ్‌గా చెబుతోన్న బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయమై కేటీఆర్ త‌న న్యాయ‌వాదుల‌తో చ‌ర్చిస్తున్నార‌ని పార్టీ నేతలు చెబుతున్నారు.

లీగల్ ఫైట్ చేస్తానని కేటీఆర్ చెబుతుండడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనే ఉత్కంఠను రేపుతోంది. మొత్తానికి కేటీఆర్‌ను అరెస్ట్ చేసి తీరాలన్న తెలంగాణ ప్రభుత్వ పంతం నెగ్గుతుందా.. లేదంటే న్యాయం తన వైపు ఉందంటున్న కేటీఆర్ మాట నిజం అవుతుందా అన్నది వేచి చూడకతప్పదు..

Tammineni Sitaram: తమ్మినేని సీతారాంకి సోషల్‌ మీడియా సెగ!