Gaddar : మునుగోడు బైపోల్.. కేఏ పాల్‌కు గద్దర్ షాక్, ఇప్పటివరకు నామినేషన్ వేయలేదు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి గద్దర్ ఝలక్ ఇచ్చారు. ఇప్పటివరకు గద్దర్ నామినేషన్ వేయలేదు. రేపటితో(అక్టోబర్ 14) మునుగోడు నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది.

Gaddar : మునుగోడు బైపోల్.. కేఏ పాల్‌కు గద్దర్ షాక్, ఇప్పటివరకు నామినేషన్ వేయలేదు

Gaddar-KA PAUL Munugode Bypoll

Updated On : October 13, 2022 / 8:03 PM IST

Gaddar : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి గద్దర్ ఝలక్ ఇచ్చారు. ఇప్పటివరకు గద్దర్ నామినేషన్ వేయలేదు. రేపటితో(అక్టోబర్ 14) మునుగోడు నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది.

గద్దర్ నామినేషన్ వేయకపోవడంపై పాల్ స్పందించారు. గద్దర్ ను తమ అభ్యర్థిగా ప్రకటించడంతో ఇతర పార్టీలు ఆయనపై ఒత్తిడి చేశాయని పాల్ ఆరోపించారు. గద్దర్ పై ఒత్తిడి తేవడంతోనే ఆయన ఆసుపత్రి పాలయ్యారన్నారు.

మరోవైపు డూప్లికేట్ ఓట్లతో మునుగోడులో గెలవాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నారని కేఏ పాల్ విమర్శించారు. కనుక మునుగోడు ఉపఎన్నికను వాయిదా వేయాలని ఈసీని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు కేఏ పాల్.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”24వేల డూప్లికేట్ ఓట్లను ఓటర్ జాబితాలో చేర్చి గెలుద్దామని చూస్తున్నారు. కనుక ఈ ఎన్నికలను పోస్ట్ పోన్ చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశాం. హైకోర్టులో పిల్ వేశాం. సుప్రీంకోర్టులోనూ పిల్ వేస్తాం. ఈ ఎలక్షన్ ను ఎట్టిపరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేయాల్సిందే. మూడు శాతం ఓట్లున్న రెడ్డి సామాజికవర్గానికి ఈ మూడు పార్టీలు(టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్) సీట్లు ఇవ్వాల? టీఆర్ఎస్-కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ-రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్-స్రవంతి రెడ్డి. మరి 91శాతం ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏమయ్యారు?” అని కేఏ పాల్ ప్రశ్నించారు.