Gangula Kamalakar: సరిగ్గా అదే సమయానికి రాహుల్ గాంధీ సభ.. అందుకే ఇలా..: మంత్రి గంగుల

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలా తాము దొంగలం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

Gangula Kamalakar: సరిగ్గా అదే సమయానికి రాహుల్ గాంధీ సభ.. అందుకే ఇలా..: మంత్రి గంగుల

గంగుల కమలాకర్ (Photo: Instagram)

Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ నిర్వహించిన బహిరంగ సభపై మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు గుప్పించారు. దసరా షాపింగ్ కోసం జనాలు వచ్చే సమయానికి సభను నిర్వహించారని, అందుకే అక్కడ జనాలు కనపడ్డారని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీకి ఇష్టం లేకుండానే కరీంనగర్‌కు ఆయనను టీపీసీసీ నేతలు తీసుకువచ్చారని గంగుల కమలాకర్ ఆరోపించారు. అభ్యర్థిని ప్రకటించకుండానే ప్రచారం చేశారని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలా తాము దొంగలం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతుందని, అప్పుడు ఆ రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. బెంగళూరులో ఆరు గంటల పవర్ కట్ ఉందని చెప్పారు. ఆ రాష్ట్రంలో వేలాది ఎకరాల పంట పొలాలు ఎండి పోయాయని ఆరోపించారు. కర్ణాటకలో ఐదు నెలల్లో ఐదు గ్యారంటీ పథకాలు అధోగతి పాలయ్యాయని చెప్పారు. శక్తి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఇస్తామని అన్నారని, డీజిల్ లేక బస్సులు ఆగిపోతున్నాయని విమర్శించారు.

Assembly Elections 2023: బీజేపీని తీవ్రంగా ఇబ్బంది పెడుతోన్న రెబల్స్.. రెండో జాబితాకు ముందే మళ్లీ రగడ