Marriage: పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య

ఏడాది కాలంగా ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరకపోవడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి కృష్ణా నగర్ లో ఈ ఘటన జరిగింది.

Marriage: పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య

Marriage (3)

Updated On : May 16, 2021 / 7:52 AM IST

Marriage: ఏడాది కాలంగా ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరకపోవడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి కృష్ణా నగర్ లో ఈ ఘటన జరిగింది. కృష్ణానగర్‌ ఏ బ్లాక్‌లో నివాసముంటున్న కావ్య (23)కు ఏడాది కాలంగా కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

చాలామంది వచ్చి చూసి వెళ్లారు కానీ పెళ్ళిమాత్రం కుదరలేదు.. దీంతో మనస్తాపం చెందిన యువతి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.