Telangana Govt: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు మరో శుభవార్త.. వాళ్లకుకూడా ఏప్రిల్ నుంచే ఫ్రీగా సన్నబియ్యం

రేషన్ కార్డు దరఖాస్తుదారులకు లబ్ధిచేకూర్చేలా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Govt: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు మరో శుభవార్త.. వాళ్లకుకూడా ఏప్రిల్ నుంచే ఫ్రీగా సన్నబియ్యం

Thin Rice Distribution

Updated On : March 27, 2025 / 10:12 AM IST

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డులు అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. అర్హులను గుర్తించి వారికి కార్డులు మంజూరు చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also : Telangana Cabinet Expansion : తెలంగాణ మంత్రివర్గ రేసులో మరో రెడ్డి నేత పేరు..!

తెలుగువారి తొలి పండుగ ఉగాది పర్వదినం రోజున (మార్చి 30) ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంను ప్రభుత్వం ప్రారంభించనుంది. హుజుర్ నగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న సుమారు మూడు కోట్ల మందికి అంటే రాష్ట్ర జనాభాలో 84శాతానికి పైచిలుకు లబ్ధిదారులకు సన్నం బియ్యం అందించబోతున్నట్లు మంత్రి తెలిపారు.

Read Also : Bhadrachalam Temple New Design : భద్రాచలం ఆలయ నూతన డిజైన్లు విడుదల..

ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీని ప్రారంభిస్తామని తెలిపిన మంత్రి ఉత్తమ్.. కొత్త కార్డులు మంజూరు చేసేవరకు.. ప్రస్తుతం కార్డులు మంజూరైన లబ్ధిదారులకుకూడా సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం 80శాతం మంది లబ్ధిదారులు ఉపయోగించుకోవటం లేదు. రూ.8వేల కోట్ల బియ్యం పంపిణీ జరిగితే వాటిని లబ్ధిదారులు ఉపయోగించకపోవటంతో పక్కదారి పడుతున్నాయి. అందుకే పేదలకు కడుపునిండా తినేలా సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.