Gossip Garage : గోరటి వెంకన్నకు నజరానా వెనక సీఎం రేవంత్ ప్లాన్ అదేనా?
గోరటి వెంకన్న కూడా ప్రభుత్వ నజరానా తీసుకోనని.. తీసుకుంటానని ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో గోరటి వెంకన్న నిర్ణయం ఎలా ఉండబోతుందని ఉత్కంఠ మొదలైంది.

Gossip Garage Gorati Venkanna (Photo Credit : Google)
Gossip Garage : తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లను సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి చేరిపేస్తున్నారా.. టీఎస్, యాదాద్రి, తెలంగాణ విగ్రహం మార్పు చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పుడు ఉద్యమ కళాకారులను బీఆర్ఎస్‌కు దూరం చేయాలని కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ వేసిందా. ఇప్పటికే అందెశ్రీని తన వైపు తిప్పుకుంది. మరిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ ఎవరిపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్‌లో ఉన్న ఆ ఎమ్మెల్సీకి ఎందుకు నజరానా ప్రకటించింది. మరి ఆ ఎమ్మెల్సీ ఆ నజరానా తీసుకుంటారా.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా..?
కళాకారులకు సర్కార్ కోటి రూపాయాల నజరానా..
కాంగ్రెస్ ఏడాది ప్రభుత్వ పాలన వేడుకలు గులాబీ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చి పెట్టాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గులాబీ పార్టీలో ఓ ఎమ్మెల్సీని డిఫెన్స్‌లోకి లాగింది. ప్రజా పరిపాలన వేడుకల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహానికి కొత్త రూపం ఇస్తూ.. సచివాలయంలో ఆవిష్కరించింది కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేసిన కొంతమందికి కళాకారులకు సర్కార్ కోటి రూపాయాల నజరానాలు ప్రకటించింది. పైగా ఇంటి స్థలాన్ని కూడా ప్రకటించింది. ఇదంతా బాగానే ఉంది కానీ. నజరానా ప్రకటించిన జాబితాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పేరు కూడా ఉండడం పెద్ద చర్చకు దారితీసింది.
కళాకారులను, ఉద్యమకారులను కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నం..
కవి గోరటి వెంకన్న.. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారు. తన రాగాలతో ఉద్యమ స్ఫూర్తి రగిలించారు. తెలంగాణ ప్రజల్ని ఉద్యమం వైపు నడిపించారు. ప్రజాకవి గోరటి వెంకన్న హృదయమంతా పాటల సవ్వడితోనే మార్మోగిపోతోంది. ఆయన హృదయాన్ని పలకరిస్తే.. మన మనసు పులకరించి పోవాల్సిందే. ఆయన నోటి వెంట జానపదాలు జలపాతాల్లా ప్రవహిస్తూనే ఉంటాయి. అలాంటి ఉద్యమ కళాకారుడిని పెద్దల సభకు పంపించింది బీఆర్‌ఎస్. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్‌కు ముద్రపడింది. ఆ ముద్రను తొలగించేందుకు ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్న కీలక కళాకారుల్ని, ఉద్యమకారుల్ని కాంగ్రెస్ తన వైపు తిప్పుకునేందుకు ట్రై చేస్తోందని టాక్ వినిపిస్తోంది.
నజరానాలను తీసుకుంటే ఆ పార్టీకి విధేయులుగా మారిపోయినట్లే?
ఇప్పటికే జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించి ఆ పాట రాసిన అందెశ్రీని తమ వైపు తిప్పుకోగలిగారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న గోరటి వెంకన్నకు ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించడంతో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌లో ఉన్న గోరటి వెంకన్న ఆ నజరానాను తీసుకుంటారా లేదా అని పెద్ద చర్చగా మారింది. ఓ కళాకారుడిగా తీసుకుంటే తప్పేంటని వాదించే వాళ్లు కూడా లేకపోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే నజరానాలను తీసుకుంటే ఆ పార్టీకి విధేయులుగా మారిపోయినట్లేనని చర్చ కూడా జరుగుతుంది. నజరానా పుచ్చుకుంటే బీఆర్‌ఎస్ పెద్దలు ఈ విషయాన్ని సీరియస్‌గానే అవకాశం కూడా ఉంది.
గోరటి వెంకన్న కారు దిగిపోకుండా చర్యలు…
దీంతో ప్రభుత్వ నజరానా తీసుకోవాలా వద్దా అని గోరటి వెంకన్న డైలామాలో ఉన్నట్లు సమాచారం. గోరటి వెంకన్న ఎక్కడ చేజారిపోతారోనని బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయ్యింది. గోరటి వెంకన్నను కారు దిగకుండా చేసే బాధ్యతలను ఆయన సామాజికవర్గానికి చెందిన ఓ యువ నేతకు అప్పగించారు. దీంతో ఆయన రెండు, మూడ్రోజులగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎమ్మెల్సీ సొంత పనులపై బయటకు వెళ్లినా ఆ యువ నేత మాత్రం నీడలా వెంటే ఉంటున్నారట.
గోరటి వెంకన్న నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..
గోరటి వెంకన్న కూడా ప్రభుత్వ నజరానా తీసుకోనని.. తీసుకుంటానని ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో గోరటి వెంకన్న నిర్ణయం ఎలా ఉండబోతుందని ఉత్కంఠ మొదలైంది. ఇప్పటికే గోరటి వెంకన్న బీఆర్‌ఎస్ పార్టీతో అంటిముట్టన్నట్లు ఉంటున్నారు. ఇప్పుడు సడెన్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం నజరానా ప్రకటించడంతో గోరటి వెంకన్న ఎలా రియాక్ట్ అవుతారని పెద్ద టాపిక్ గా మారింది.
Also Read : బీజేపీ నేతలకు ఆర్.కృష్ణయ్య గుబులు..! కారణం అదేనా?