Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసం పథకం.. ప్రభుత్వం మరో కీలక అప్‌డేట్.. సబ్సిడీ, ట్రైనింగ్ ఇలా పొందండి!
రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారికి రెండు దశల్లో సబ్సిడీ రిలీజ్ చేయడం జరుగుతుందని భట్టి విక్రమార్క చెప్పారు.

Rajiv Yuva Vikasam scheme
Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల్లోని అర్హులైన ఐదు లక్షల మంది యువతకు రూ. 4లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకంకు ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్ లో రూ.6వేల కోట్లు కేటాయించింది. ఈ పథకానికి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల గడువు ముగియడంతో ప్రస్తుతం అర్హుల ఎంపికపై దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ పథకం గురించి కీలక విషయాలు చెప్పారు.
ప్రజాభవన్ లో బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 6వేల కోట్లు ఖర్చు పెడుతుందని, బ్యాంకర్లు రూ. 1600 కోట్లు లింకేజీ ఇచ్చేందుకు ముందుకు రావాలని సూచించారు. లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదల చేయగానే, బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని రిలీజ్ చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని లబ్ధిదారులకు అందజేయాలని, దాన్ని లోన్లు, ఈఎంఐల కింద కట్టుకోవద్దని చెప్పారు.
రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారికి రెండు దశల్లో సబ్సిడీ రిలీజ్ చేయడం జరుగుతుందని భట్టి విక్రమార్క చెప్పారు. పథకం మంజూరైన తరువాత కొంతమొత్తం సబ్సిడీ కింద ఇవ్వటం జరుగుతుందని, స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్న తరువాత మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు.
ఈ పథకం కింద లబ్ధిపొందేవారికి వ్యాపారం చేసుకోవడం, లాభాలు సాధించడంపై అధికారులు మూడు రోజుల నుంచి 15 రోజుల వరకు శిక్షణ ఇస్తారు. వ్యాపారంలో ఇబ్బందులు ఏర్పడితే శిక్షణ సంస్థలు మద్దతు ఇస్తాయని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా రాష్ట్రంలోని యువతకు సహాయపడేందుకు బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని, పథకంలో బ్యాంకర్లు ఉత్సాహంగా పాల్గొనాలని భట్టి విక్రమార్క కోరారు. ఈ పథకం గేమ్ ఛేంజర్ గా నిలుస్తుందని అన్నారు.
Also Read: Gold Rate: వామ్మో.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. సరికొత్త రికార్డులు నమోదు.. ఇక గోల్డ్ కొనలేమా..!A