Telangana: గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా
గతంలో కూడా ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే అప్పుడు ఇతర పోటీ పరీక్షల రద్దీ ఒక కారణం కాగా, పరీక్ష రద్దు చేయాలనే డిమాండ్ల మధ్య గ్రూప్-2 పరీక్ష రద్దైంది

Group2 Exam: తెలంగాణలో నిర్వహించాల్సిన గ్రూప్-2 పరీక్ష వాయిదా పడింది. ఇంతకు ముందే వాయిదాల పర్వంతో కొనసాగుతోన్న ఈ పరీక్ష మరోసారి వాయిదా పడడం గమనార్హం. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఆ ప్రభావం పరీక్షపై ఉంటుందని, దీంతో వాయిదా వేయాల్సి వచ్చిందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి మంగళవారం రాత్రి ప్రకటించారు. వాస్తవానికి ఈ పరీక్షలు నవంబర్ 2,3 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. గతంలో కూడా ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే అప్పుడు ఇతర పోటీ పరీక్షల రద్దీ ఒక కారణం కాగా, పరీక్ష రద్దు చేయాలనే డిమాండ్ల మధ్య గ్రూప్-2 పరీక్ష రద్దైంది. తాజాగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరీక్షను మరోసారి వాయిదా వేశారు. అయితే ఈ పరీక్ష జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.